Guntur Kaaram : సూపర్ స్టార్ ఇరగదీశాడు.. కొత్త పాటను లాంచ్ చేసిన తమన్..
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు (జనవరి 9న) గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరు వైస్ చాలా బాగున్నాయని.. ఇప్పటికే సంక్రాంతి సినిమా రిలీజ్ అయిపోయినట్లు అనిపిస్తోందని అన్నారు దిల్ రాజు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ సరికొత్తగా మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు (జనవరి 9న) గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరు వైస్ చాలా బాగున్నాయని.. ఇప్పటికే సంక్రాంతి సినిమా రిలీజ్ అయిపోయినట్లు అనిపిస్తోందని అన్నారు దిల్ రాజు. తమన్ అందించిన మూడు పాటలు రిలీజ్ అయ్యాయని.. ఇప్పటికే బ్లాక్ హిట్ కూడా అయ్యాయని.. కుర్చీ మడతపెట్టి సాంగ్ అందరినీ ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు. ఇక ఇదే వేదికపై గుంటూరు కారం నుంచి కొత్త పాటను రిలీజ్ చేశారు తమన్.
“బావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు.. గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు.. చెప్పుకోలేని బాధే డబల్లు.. మారిపోయే లోకం.. చెడ్డోళ్లంతా ఏకం.. నాజుక్కు అయినా నాబోటోడికి దినదినమోక నరకం.. యాడో లేదు లోపం.. నామీదే నాకు కోపం.. అందనన్నా ఆకాశానికి ఎంతకని ఎగబడతాము ” అంటూ సాగే హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ఆకట్టుకుంది.
ఈ పాటలో స్టెప్పులతో ఇరగదీశాడు మహేష్ బాబు. మొత్తానికి గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ ఒక్కో పాటకు అద్భుతంగా డాన్స్ చేసి అదరగొట్టేశాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
The next banger from #GunturKaaram, 🔥 #MawaaEnthaina song will be out TODAY 🕺
A @MusicThaman Musical 🎹🥁
Super 🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @Yugandhart_ @haarikahassine @adityamusic @shreyasgroup… pic.twitter.com/AX5LKUsOvs
— Guntur Kaaram (@GunturKaaram) January 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.