Mahesh Babu: ‘ఇకపై ప్రేక్షకులే నాకు అమ్మ, నాన్న’.. మహేష్ ఎమోషనల్ స్పీచ్..
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు (జనవరి 9న) గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ సరికొత్తగా మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఈవెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
“గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. నాకు స్నేహితుడి కంటే ఎక్కువ. నా కుటుంబసభ్యుడిలాగా. గత రెండు సంవత్సరాలుగా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన సినిమాల్లో నేనెప్పుడు చేసినా.. నా నటనలో మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు తెలియదు. ఖలేజా సినిమా సమయంలో నా నటనలో ఓ మ్యాజిక్ జరిగింది.. ఇప్పుడు గుంటూరు కారంలో జరగింది. ఈ సినిమాలో మునుపెన్నడు చూడని మహేష్ ను చూడబోతున్నారు.” అంటూ చెప్పుకొచ్చారు.
మా ప్రొడ్యూసర్ ఫేవరెట్ హీరో నేనే. నా యాక్టింగ్ చూసి చాలా సంతోషించారు. శ్రీలీలతో డాన్స్ చేయడం.. అంటే.. హీరోలందరికి తాట ఊడిపోద్ది. తెలుగమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ కావడం గర్వంగా ఉంది. అని అన్నారు మహేష్. తమన్ నాకు బ్రదర్ లాగా. ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టే సాంగ్ గురించి అడగ్గానే.. ఏమి ఆలోచించకుండా ఆ సాంగ్ ఇచ్చేశాడు.. థియేటర్లలో ఆ పాట అదిరిపోద్ది. ఏవీ చూడగానే నాకు పాతిక సంవత్సరాలు అని తెలిసింది. నాకు తెలియదు. అదంతా మీరు చూపించిన అభిమానమే. మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప మరేమి తెలియదు. సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. నాకు, నాన్నగారి సినిమాలు హిట్ అయ్యేవి. నా సినిమా రిలీజ్ కాగానే నాన్న గారి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఎందుకంటే ఆయన మాటలు కోసమే కదా సినిమాల్లో ఇంత కష్టపడేది. కానీ ఇప్పటినుంచి అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఆయన లేరు. ఇప్పటినుంచి ఆ విషయాలన్నీ మీరే చెప్పాలి. ఇకపై మీరే నాకు అమ్మా, నాన్న” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.