Mahesh Babu: ‘లీల.. కంగారు పడకమ్మా.. వామ్మో అదేం డాన్స్.. తనతో డాన్స్ అంటే హీరోలందరికీ’.. మహేష్ ఫన్నీ కామెంట్స్..
తాజాగా ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ మరో కొత్త పాట రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మామ ఎంతైనా అంటూ సాగే పాటలో మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు మహేష్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న మహేష్.. సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీలీల గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు చేశారు మహేష్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. టీజర్, పోస్టర్లతో ఆసక్తిని పెంచిన టీం.. ఇక ట్రైలర్‌తో సినిమాపై ఓ రేంజ్ అంచనాలను పెంచారు. ఇక ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ మరో కొత్త పాట రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మామ ఎంతైనా అంటూ సాగే పాటలో మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు మహేష్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న మహేష్.. సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. అంతకు ముందు గుంటూరుకారం చిత్రయూనిట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీలీల గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు చేశారు మహేష్.
“గుంటూరు కారం సినిమాలో కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు. అతడు, ఖలేజా సినిమా సమయంలో నా నటనలో వచ్చిన మ్యాజిక్.. ఇప్పుడు మరోసారి గుంటూరు కారం మూవీలో అదే మ్యాజిక్ కనిపిస్తుంది. మా ప్రొడ్యూసర్ కు నేనే ఫేవరేట్ హీరో. నా నటను మానిటర్ లో చూస్తూ సంతోషించేవారు. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఇంకా గొప్ప సినిమాలు చేయాలని ఉంది” అని అన్నారు.
❤️❤️
Super🌟@urstrulyMahesh #GunturKaaram pic.twitter.com/DKsRrasYzN
— Guntur Kaaram (@GunturKaaram) January 9, 2024
“ఇక లీల.. కంగారు పడకమ్మా.. మర్చిపోవట్లే.. నీ గురించే మాట్లాడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం. షార్ట్ ఉన్నా.. లేకపోయినా అక్కడే ఉంటుంది. మేకప్ రూంలోకి వెళ్లదు. నాకు, మా గుంటూరు కారం టీంకు తనకు మంచి బాండింగ్ ఉంది. ఇక ఈ అమ్మాయితో డాన్స్ చేయడం.. వామ్మో.. అదేం డాన్స్.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది.. కానీ తనతో కలిసి పనిచేయడం చాలా ఎంజాయ్ చేశాను ” అని అన్నారు మహేష్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.