Guntur Kaaram: ‘ఆ విషయంలో మహేష్ ఒక్కరే.. ఈసారి సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం’.. త్రివిక్రమ్ కామెంట్స్..
ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం.. మరొకటి రమణగాడు మీవాడు.. మనందరి వాడు. అందుకే మీ మధ్య ఈ వేడుక చేయాలని అనుకున్నాం. షూటింగ్లో చాలా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా సరే.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చారు. అందుకే మీరు కొంచెం క్రమశిక్షణగా మెలిగి పోలీసువారికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణగారు తెలుగు సినిమాల్లో ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప నటుడు. మహామనిషి అలాంటి ఆయనతో నేను నేరుగా పని చేయలేకపోయాను.

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం.. మరొకటి రమణగాడు మీవాడు.. మనందరి వాడు. అందుకే మీ మధ్య ఈ వేడుక చేయాలని అనుకున్నాం. షూటింగ్లో చాలా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా సరే.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చారు. అందుకే మీరు కొంచెం క్రమశిక్షణగా మెలిగి పోలీసువారికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. పోలీసువారు కంట్రోల్ చేయలేక..అలసిపోతున్నారు. అందుకే ఈవెంట్ త్వరగా ముగించేద్దాం. సూపర్ స్టార్ కృష్ణగారు తెలుగు సినిమాల్లో ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప నటుడు. మహామనిషి అలాంటి ఆయనతో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ ఆయన పని చేసిన సినిమాకు పోసాని కృష్ణ మురళి గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాను. మహేష్ బాబుతో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసినప్పుడు ఆడనయతో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతిక్షణం చాలా చాలా అమూల్యమైనది. అపురూపమైనది. అలాంటి గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ ఇంకెంత అదృష్టవంతుడో అనిపిస్తుంది.
తండ్రి చేయలేని కొన్ని రకాల సినిమాలను కూడా చేయడానికి రెడీగా ఉండే తండ్రికి తగ్గ తనయుడు మహేష్ అనిపిస్తుంది. ఒక సినిమాకు 100% కాదు.. 200% పనిచేసే నటుడు మహేష్ ఒక్కరే. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్కరు వెనక్కి తిరిగి చూలేరు. అతడు, ఖలేజా సినిమాలు చేసినప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. పాతికేళ్లు అవుతుందని మీరంటున్నారు.. కానీ మాత్రం మూడేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడు అనిపిస్తుంది. చూడటానికి ఎంత యవ్వనంగా ఉన్నారో.. యాక్టింగ్ లోనూ అంతే యవ్వనంగా ఉన్నారు. ఈసారి సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం” అంటూ చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.
డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా.. హసిని హరికా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.