
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అనేక లవ్ స్టోరీ చిత్రాల్లో ఈ మూవీ ఒకటి. బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈసినిమా విడుదలై ఇప్పటికే 20 ఏళ్లు పూర్తైంది. కానీ ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించిన ఈ సినిమా నాగ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఇందులో నాగార్జునతోపాటు సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే కుర్రాళ్లను కట్టిపడేసింది అన్షు.
మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మన్మథుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు.. ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోనూ కనిపించింది. అయితే ఈ రెండు సినిమాల్లో అన్షు పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సైతం అలాంటి తరహా పాత్రలే రావడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. 15 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న అన్షు.. ఇటీవలే మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత లండన్ కు చెందిన సచిన్ సగ్గార్ ను వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల మజాకా సినిమా ప్రమోషన్లలో తన కూతురితో సందడి చేసింది అన్షు.. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతుండగా.. అన్షు కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..