Dulquer Salmaan: కమల్ హాసన్ సినిమానుంచి తప్పుకున్న దుల్కర్ సల్మాన్.. కారణం ఇదేనా..!

కమల్, మణిరత్నం ఇద్దరూ కలిసి 'థగ్ లైఫ్' అనే సినిమా చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ తమిళ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటించాడని గతంలో వార్తలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

Dulquer Salmaan: కమల్ హాసన్ సినిమానుంచి తప్పుకున్న దుల్కర్ సల్మాన్.. కారణం ఇదేనా..!
Dulquer Salmaan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2024 | 10:06 AM

నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నంలది హిట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కమల్, మణిరత్నం ఇద్దరూ కలిసి ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ తమిళ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటించాడని గతంలో వార్తలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

1987లో ‘నాయకన్‌’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో కమల్, మణిరత్నం తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ కలిసి పనిచేయలేకపోయారు. ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ చిత్రానికి ‘థగ్‌ లైఫ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘థగ్ లైఫ్’ చిత్రంలో త్రిష కృష్ణన్, జయం రవి, నాజర్, అభిరామి తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇంత మంచి కాంబినేషన్ నుంచి దుల్కర్ ఎందుకు తప్పుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దుల్కర్ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో తెలియక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. దుల్కర్  డేట్స్ సెట్ చేసుకోలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ తాజాగా సూర్య 43వ చిత్రానికి సంతకం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ చిత్రంలో విజయ్ వర్మ, నజ్రియా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఎన్‌బీకే109’ సినిమాలోనూ దుల్కర్ నటిస్తున్నారని తెలుస్తోంది. . ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక కమల్ సినిమా నుంచి దుల్కర్ తప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్ చాలా డిమాండ్ ఉన్న హీరో. అతను మలయాళ సినిమాతో పాటు తమిళం, తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటిస్తున్నాడు.

దుల్కర్ సల్మాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

దుల్కర్ సల్మాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?