Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.. చెయన్నని తెగేసి చెప్పిన స్టార్ నటుడు
త్వరలోనే ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. దాంతో పవన్ వరుస సభలతో బిజీ అయ్యారు. అలాగే గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే ఇప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఓ స్టార్ హీరో నో చెప్పారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. దాంతో పవన్ వరుస సభలతో బిజీ అయ్యారు. అలాగే గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే ఇప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఓ స్టార్ హీరో నో చెప్పారట. పైగా ఆ సినిమా సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకున్న నటుడు ఎవరో తెలుసా..?
పవన్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. వాటిలో సుస్వాగతం సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన ప్రేమకథతో పాటు చక్కటి మెసేజ్ తో వచ్చిన సుస్వాగతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా దేవయాని నటించారు. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా సుస్వాగతం సినిమాలో పాటలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో పవన్ కు తండ్రిగా రఘువరన్ నటించారు. అయితే ఆయన పాత్ర కోసం ముందుగా ఎవరు గ్రీన్ హీరో, సోగ్గాడు శోభన్ బాబును అనుకున్నారట. అయితే అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. సుస్వాగతం సినిమా టైంకు శోభన్ బాబు కేరీర్ డౌన్ అయ్యింది. కానీ ఆయన హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని తెలిపారట. తనతోటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారుతున్న టైంలో తాను మాత్రం హీరోగానే సినిమా చేస్తానని తెలిపారట. అదే టైం లో సుస్వాగతం సినిమాలో ఛాన్స్ వచ్చినా శోభన్ బాబు నో చెప్పారట. ఆతర్వాత ఆపాత్రను రఘువరన్ తో తెరకెక్కించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




