Avatar 2 : అవతార్ 2 సినిమాను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అవతార్ 2 సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా నయా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ ఓపినింగ్స్ తో అదరగొట్టిన అవతార్2 ఇప్పటికీ అదే దూకుడుతో దూసుకుపోతోంది. గతంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సుమారు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అవతార్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ. 34.22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది . ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖసంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఓటీటీ సంస్థ డిస్నిహాట్ స్టార్ అవతార్ 2 సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే అవతార్ సినిమా సుమారు 234 రోజుల తర్వాతనే ఓటీటీలో ప్రసారం కానుందని కూడా తెలుస్తోంది. అవతార్ సినిమా 3డి, 4డిఎక్స్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. దాంతో సామాన్యులకు టికెట్ భారం పడుతోంది. దానివల్ల ఓటీటీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.








