Jr NTR: తారక్‌ను మేము ఎప్పుడూ అలా చూడలేదు.. ఎన్టీఆర్ గురించి హరికృష్ణ అప్పట్లో ఏమన్నారంటే

తారకరామారావు మనవడిగా.. హరికృష్ణ చిన్న కొడుకుగా నటనలో వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సింహాద్రి సినిమాలతో కెరీర్ బిగినింగ్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్

Jr NTR: తారక్‌ను మేము ఎప్పుడూ అలా చూడలేదు.. ఎన్టీఆర్ గురించి హరికృష్ణ అప్పట్లో ఏమన్నారంటే
Harikrishna, Ntr
Follow us

|

Updated on: Dec 07, 2022 | 7:03 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు మనవడిగా.. హరికృష్ణ చిన్న కొడుకుగా నటనలో వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సింహాద్రి సినిమాలతో కెరీర్ బిగినింగ్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్ డాన్స్ కు యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ ను ఆయన ఫ్యామిలీ దూరం పెట్టిందని.. తారక్ ను పట్టించుకునే వారు కాదు అని ఎన్నో రూమర్స్ వచ్చాయి అప్పట్లో.. అయితే ఆ రూమర్స్ పై తారక్ తండ్రి హరికృష్ణ గతంలో స్పందించారు.

ఎన్టీఆర్ తో కలిసి హరికృష్ణ స్టేజ్ పైన కనిపించిన సంఘటనలు చాలా అరుదు. హరికృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపైన కనిపించిన సినిమా ఫంక్షన్.. శివ రామరాజు సినిమా ఆడియో లాంచ్.. ఈ సినిమాలో హరికృష్ణ కీలక పాత్రలో నటించారు. జగపతి బాబు ఈ సినిమాలో హీరోగా చేశారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో హరికృష్ణ మాట్లాడుతూ..

జూనియర్ ఎన్టీఆర్ ను మా ఫ్యామిలీ పట్టించుకోవడం లేదని.. ఒంటరిని చేశామని పుకార్లు పుట్టించారు.. అదంతా అబద్ధం అని కొట్టిపారేశారు. ఎవరికి వారు స్వశక్తితో ఎదగాలి.. మా తండ్రి రామారావు కూడా ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చారు.   ఒంటరిగానే పోరాటం చేశారు.. బాలకృష్ణ ను కూడా మా నాన్న గారు పైకి తీసుకురాలేదు.. నేను నాన్నగారికి డ్రైవర్‌గా పని చేశాను. ఇలా అందరం ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చాము. కాబట్టి ఎవరికి వాళ్లే పైకి రావాలి.. ఎన్టీఆర్ కూడా స్వయం శక్తితో పైకి వస్తుంటే చూస్తూ ఆనందిచడంలో తండ్రిగా ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాను.. అని క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి