Rana Daggubati: రానా ఎందుకు సినిమాలు చేయట్లేదు..? కనీసం కథలు ఎందుకు వినట్లేదు..? అదే రీజనా..?

రానా మంచి యాక్టర్. పాత్ర నచ్చితే చాలు ఎలాంటి వేషమైనా సరే చేసేస్తాడు. అయితే గత కొంతకాలంగా అతడు ఏ సినిమా చేయట్లేదు..? కనీసం కథలు కూడా వినడం లేదని టాక్.

Rana Daggubati: రానా ఎందుకు సినిమాలు చేయట్లేదు..? కనీసం కథలు ఎందుకు వినట్లేదు..? అదే రీజనా..?
Rana Daggubati
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 07, 2022 | 7:05 PM

రానా దగ్గుబాటి ఏమయ్యారు..? కొన్ని నెలలుగా ఎందుకు సినిమాలు చేయడం లేదు.. కొన్నేళ్లుగా కథలు ఎందుకు వినడం లేదు..? కేవలం హెల్త్ ఇష్యూసే కారణమా..? లేదంటే ఇతర కారణమేమైనా ఉందా..? విరాట పర్వం తర్వాత సినిమాలే సైన్ చేయలేదు దగ్గుబాటి వారసుడు. పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్నా.. ప్రాజెక్ట్స్ ఎందుకు ఒప్పుకోవడం లేదు..? ఈ గ్యాప్ ఇంకెన్నాళ్ళు ఉండబోతుంది..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.  లీడర్‌తో కెరీర్ మొదలుపెట్టిన రానా దగ్గుబాటి.. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఫలితంతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు కూడా చేసారీయన. కేవలం హీరోగానే కాకుండా.. కారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీ అయ్యారు రానా. బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. దానికి ముందే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు రానా. కానీ ఈ మధ్య దగ్గుబాటి హీరోలో మునపటి జోష్ కనిపించట్లేదు.

బాహుబలి 2, నేనేరాజు నేనేమంత్రి వరకు బాగానే సాగిన రానా జర్నీ.. ఆ తర్వాత కాస్త తడబడింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబుగా ఆకట్టుకున్న రానా.. నాలుగేళ్లుగా హీరోగా సినిమాలే చేయడం లేదు. హౌజ్ ఫుల్ 4లో చిన్న పాత్ర.. అరణ్య, 1945 ఎన్నో వాయిదాల తర్వాత వచ్చాయి. ఇక విరాట పర్వం కూడా కరోనాకు ముందు సైన్ చేసిన సినిమా. కేవలం భీమ్లా నాయక్ మాత్రమే ఈ మధ్య కాలంలో రానా పూర్తి చేసారు.

ఆ మధ్య అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు రానా. అప్పట్నుంచే సినిమాలు సంఖ్య తగ్గించేసారు. విరాట పర్వం తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు ఈయన. ఇంకా చెప్పాలంటే రెండేళ్లుగా కథలే సరిగ్గా వినట్లేదు. వెంకటేష్‌తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు రానా. మరి మళ్లీ దగ్గుబాటి వారసుడిలో మునపటి జోష్ ఎప్పటికి కనిపిస్తుందో చూడాలిక.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి.. కేవలం అవి మాత్రమే తన ఆహరం
50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి.. కేవలం అవి మాత్రమే తన ఆహరం
ఆ పాడు పని చేసిన మహిళా టీచర్‌కు.. 30 ఏళ్ల జైలు శిక్ష
ఆ పాడు పని చేసిన మహిళా టీచర్‌కు.. 30 ఏళ్ల జైలు శిక్ష