AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో అందరికంటే అందగాడు.. ఆ ఒక్క అలవాటుతో కెరీర్ క్లోజ్..! చివరికి

ఇండస్ట్రీలో చాలా మంది నటులు తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ అలాగే ఎంతో మంది స్టార్స్ గా మారి రాణించారు. కానీ కొంతమంది చేతులారా కెరీర్ ను నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు. వారిలో ఈ హీరో ఒకరు.

ఇండస్ట్రీలో అందరికంటే అందగాడు.. ఆ ఒక్క అలవాటుతో కెరీర్ క్లోజ్..! చివరికి
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2026 | 10:40 AM

Share

తెలుగు చిత్రసీమలో నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ ఏఎన్నార్ తర్వాత అంతటి అందగాడు, అజాన బాహుడు, అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడిగా హరినాథ్ పేరు తెచ్చుకున్నారు. మద్రాసు వీధుల్లో ఎంతో పొడుగ్గా, అందంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను చూసిన ఓ నిర్మాత తన సినిమాలో అవకాశం ఇవ్వడంతో హరినాథ్ వెండితెరకు పరిచయమయ్యారు. అక్కడి నుంచి ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. హరినాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ్ రాజు. ఆయన తండ్రి బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథరచయితగా పేరుపొందారు. హరినాథ్‌కు ఒక కుమారుడు శ్రీనివాసరాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. కాకినాడలోని పిఠాపురం రాజా పి.ఆర్. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే హరినాథ్ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాలలో నటించి బహుమతులు గెలుచుకున్నారు. ఆయన తండ్రి వరహాలరాజు కూడా నటుడే కాకుండా, అక్కినేని నటించిన మాయాలోకం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

హరినాథ్ తొలిచిత్రం మాయింటి మహాలక్ష్మి కాగా, ఆయన కెమెరా ముందు నిలుచున్న మొదటి సినిమా ఋష్యశృంగ. ఆ తర్వాత భక్త శబరి, మనోరమ, సహస్ర చిర్ఛేద అపూర్వ చింతామణి వంటి చిత్రాలలో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాలలో నటించి, ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తానూ ఆ వరుసలో ఉన్నానని నిరూపించుకున్నారు. ఆయన కెరీర్‌లో కీలక మలుపు సీతారామ కళ్యాణం చిత్రం. ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్, రాముడి వేషానికి యువ నటుడిని ఎంపిక చేయాలని భావించారు. ఒక రోజు పాండి బజార్‌లో హరినాథ్ కనిపించగా, ఎన్టీఆర్ ఆయన్ను చూసి తన సినిమాలో రాముడి వేషం వేయమని అడిగారు. మేకప్ టెస్ట్‌లో పాల్గొని ఫెయిల్ అయితే కెరీర్ ఏమవుతుందోనని భయపడిన హరినాథ్, తనపై తనకు నమ్మకం ఉందని ఎన్టీఆర్‌తో చెప్పారు.

ఇది కూడా చదవండి : అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

ఎన్టీఆర్ నవ్వి, స్వయంగా నుదుట తిలకం దిద్ది టెస్ట్‌కు సిద్ధం చేశారు. చివరికి హరినాథ్ రాముడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో లక్ష్మణుడిగా శోభన్ బాబు, భరతుడిగా కొమ్మినేని శేషగిరిరావు నటించారు. అయితే, ఇంతటి గుర్తింపు తెచ్చుకొని, పరిశ్రమలో బిజీ అవుతున్న తరుణంలోనే హరినాథ్ వ్యసనాలకు లోనయ్యారు. పౌరాణిక పాత్రలు పోషించేటప్పుడు ఎన్టీఆర్ ఎంతో నిష్టగా ఉండేవారు. కానీ, హరినాథ్ రాముడి వేషం వేసుకొని కూడా సిగరెట్లు కాల్చేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడి, మందలించారట కూడా. కానీ ఎంత ప్రయత్నించినా హరినాథ్ ఆ బలహీనతను వదులుకోలేకపోయారు. ఎదిగే సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాల బారిన పడితే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుందనేందుకు ఆయన జీవితం నిదర్శనం. చేజేతులా తన అద్భుతమైన కెరీర్‌ను నాశనం చేసుకున్నారు హరినాథ్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us