AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Days: ఓరి దేవుడా… ‘హ్యాపీడేస్‌’ అప్పు ఇలా మారిపోయింది ఏంటి..?

తన మార్క్‌ సహజమైన కథ, కథనాలతో ఆకట్టుకునే శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’తో ఓ మధురమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. మన జీవితంలో జరిగే కథలా అనిపిస్తుంది ఈ మూవీ స్టోరీ. సినిమాలో నిఖిల్‌ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్‌ అయ్యే అప్పు మీకు గుర్తుందా..?

Happy Days: ఓరి దేవుడా... ‘హ్యాపీడేస్‌’ అప్పు ఇలా మారిపోయింది ఏంటి..?
Nikhil - Gayatri Rao
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2024 | 6:48 PM

Share

శేఖర్ కమ్ముల తీసే సినిమాలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఆయన తీసిన హ్యాపీడేస్ సినిమా అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాత్రలు బయటకు రియలిస్టిక్ లైఫ్‌కు దగ్గరగా ఉండటంతో..  అంతా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉండే గొడవలు, ఫ్రెండ్షిప్, ప్రేమ, స్నేహం, ప్రేమ.. ఇలా అన్ని ఎమోషన్స్ సినిమాలో చాలా చక్కగా చూపించారు శేఖర్ కమ్ముల. ఇక ఆ మూవీలో నటించిన ఆర్టిస్ట్‌లు అందరూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. వరుణ్ సందేష్, నిఖిల్.. హీరోలుగా రాణిస్తుండగా.. తమన్నా స్టార్ హీరోయిన్ చక్రం తిప్పుతోంది. అయితే ఈ సినిమాలో అప్పుగా నటించిన అమ్మాయి మీకు గుర్తుందా.. నిఖిల్ లవ్ ఇంట్రస్ట్‌గా టామ్ బాయ్ క్యారెక్టర్‌లో తను నటించింది.  తన పేరు గాయత్రి రావు. సీనియర్ నటిమణి బెంగళూరు పద్మ కూమార్తే గాయత్రి రావు.

హ్యాపీడేస్ చిత్రం తర్వాత ఆమె బిజీ ఆర్టిస్ట్ అవుతుంది అనుకున్నారు కానీ.. పెద్దగా అవకాశలు అయితే రాలేదు. ఆ సినిమా వచ్చిన చాలాకాలం తర్వాత  పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో నటించింది గాయత్రి రావు. అందులో హీరోయిన్ ఫ్రెండ్ రోల్‌లో కనిపించింది గాయత్రి. గబ్బర్ సింగ్‌లో మంచి హాట్‌గా కనిపించినా.. తర్వాత పెద్ద మూవీస్‌లో ఆఫర్స్ ఏం రాలేదు. ఆ తర్వాత చిన్న, చిన్న సినిమాల్లో రోల్స్ చేసింది. ఇక 2019 లో మ్యారేజ్ చేసుకున్న గాయత్రి రావు బెంగళూర్‌లో స్థిరపడింది. పెళ్లి తర్వాత గాయత్రి రావు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం ఆమె ఫోటోలు ఏం బయటకు రాలేదు. సోషల్ మీడియాలో వెతికినా కూడా ఆమె ఆచూకి చిక్కలేదు.

Gayatri Rao

Gayatri Rao

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!