- Telugu News Photo Gallery Cinema photos Anant Ambani gets 'Orryfied' as he poses with him in new photos
Anant Ambani: కొత్త పెళ్లి కొడుకుని కూడా వదిలిపెట్టని ఓరి.. ముక్కు పిండేసిన అనంత్ అంబానీ.. ఫొటోస్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లకు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఓరీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి. చెమటంటే చిరాకు, పనిచేయడమంటే అస్సలు నచ్చదు అని చెప్పుకుని తిరిగే ఓరీ కేవలం ఫొటోలు దిగుతూనే లక్షలు సంపాదిస్తున్నాడు
Updated on: Jul 26, 2024 | 5:29 PM

బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లకు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఓరీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి. చెమటంటే చిరాకు, పనిచేయడమంటే అస్సలు నచ్చదు అని చెప్పుకుని తిరిగే ఓరీ కేవలం ఫొటోలు దిగుతూనే లక్షలు సంపాదిస్తున్నాడు

స్టార్ సెలబ్రిటీల ఎదపై చేతులు వేస్తూ ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తూ అందరితోనూ ఒకే రీతిలో ఫొటోలు దిగుతుంటాడు ఓరి. బాలీవుడ్ లో ఏ పార్టీ జరిగినా ఇతను ఉండాల్సిందే.

ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలోనూ ఓరీ సందడి చేశాడు. అక్కడకు వచ్చిన సెలబ్రిటీలందరితోనూ తన దైన స్టైల్ లో ఫొటోలు దిగాడు.

ఈ పార్టీలో ఎక్కువగా హీరోయిన్లతో ఫొటోలు దిగాడు ఓరీ. అయితే చివరకు కొత్త పెళ్లి కొడుకు అనంత్ అంబానీని కూడా వదలి పెట్టలేదీ సోషల్ మీడియా సెన్సేషన్.

అందరిలాగే అంబానీ పైనా చేయి వేసి పోజు ఇచ్చాడు ఓరి. అంతే అనంత్ అతని ముక్కు పిండేశాడు. అయిదే ఇది కేవలం సరదాగా జరిగినదే.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు' ఆఖరికి కొత్త పెళ్లికొడుకునూ వదల్లేదు. 'ఇప్పుడు బాగా అయ్యిందా నీకు' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.