My Name Is Shruthi: ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రానున్న హన్సిక లేటెస్ట్ మూవీ..

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి. 

My Name Is Shruthi: ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రానున్న హన్సిక లేటెస్ట్ మూవీ..
Hansika Motwani
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2022 | 7:59 AM

My Name Is Shruthi: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి. ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను.. అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్  దర్శకత్వం వహిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ చక్కని స్పందన వచ్చింది.

శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన హిందీ, తమిళ టీజర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు వచ్చిన స్పందన అనూహ్యం అన్నారు. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. అలాగే దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ..ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది అన్నారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నాఈ చిత్రానికి కెమెరా కిషోర్ బోయిడపు కాగా  సంగీతం మార్క్ రాబీన్ అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Mirnalini Ravi: నెమలి సోకు సోయగం తో మైమరిపిస్తున మృణాళిని రవి

Viral Photo: అందాల రాశి.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్న క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.!