Viral Photo: అందాల రాశి.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్న క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.!

అమ్మతో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెవరో కనిపెట్టడం చాలా కష్టమే..! మీకో చిన్న క్లూ ఇమ్మంటారా..

Viral Photo: అందాల రాశి.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్న క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 12, 2022 | 8:59 PM

అమ్మతో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెవరో కనిపెట్టడం చాలా కష్టమే..! మీకో చిన్న క్లూ ఇమ్మంటారా.. ఈమె ఓ క్రేజీ హీరోయిన్. తెలుగులో ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ నటించలేదు. కోలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ అందాల భామ నటించిన లేటెస్ట్‌ తమిళ చిత్రం మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. అందులో హీరోగా ధనుష్ నటించాడు. ఎవరో గుర్తుపట్టారా.! ఈపాటికి మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఎస్ కరెక్ట్.. ఆమె మరెవరో కాదు మాళవిక మోహనన్.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్. ఈమె 2013లో దుల్కర్ సల్మాన్ సరసన ‘పట్టం పోలే’ అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రం తర్వాత మాళవిక.. ‘నిర్ణయకం’, ‘నాను మట్టు వరలక్ష్మి’, ‘బియాండ్ ది క్లౌడ్స్’, ‘ది గ్రేట్ ఫాదర్’, ‘పెట్టా’ లాంటి చిత్రాల్లో నటించింది. అనంతరం ‘మాస్టర్’ సినిమాతో తమిళంలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ వెంటనే ధనుష్‌తో ‘మారన్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం హిందీలో ‘యుద్ర’ అనే మూవీతో అరంగేట్రం చేయబోతోంది.

కాగా, సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలాగే ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో మాళవికను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.