AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hamsa Nandini: మహమ్మారి పై ఒంటరి పోరాటం.. క్యాన్సర్ బాధితులకు అండగా హంసానందిని.. అమ్మ పేరు మీద ఫౌండేషన్..

నటీగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఏడాది కాలంగా ఆ మహమ్మారితో ఒంటరి పోరాటం చేసి దాన్ని జయించారు. అయితే ఈ మహమ్మారిని జయించే క్రమంలో ఎంతో నరకయాతన అనుభవించారట.

Hamsa Nandini: మహమ్మారి పై ఒంటరి పోరాటం.. క్యాన్సర్ బాధితులకు అండగా హంసానందిని.. అమ్మ పేరు మీద ఫౌండేషన్..
Hamsanandini
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2023 | 11:17 AM

Share

క్యాన్సర్ మహమ్మారిని జయించిన హీరోయిన్లలో హంసానందిని ఒకరు. అనుమానస్పదం సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటీగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఏడాది కాలంగా ఆ మహమ్మారితో ఒంటరి పోరాటం చేసి దాన్ని జయించారు. అయితే ఈ మహమ్మారిని జయించే క్రమంలో హంసానందిని ఎంతో నరకయాతన అనుభవించారట. మొదట క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమెకు మరొక షాక్ తగిలింది. ఈ క్యాన్సర్ తన తల్లి నుంచి జన్యుపరంగా వచ్చిందని తెలియడంతో మరో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో తాను చేసిన పోరాటాన్ని పంచుకున్నారు హంసానందిని.

క్యాన్సర్‏పై ఒంటరి పోరాటం..

లాక్డౌన్ తర్వాత తన సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన సమయంలో జూలై 2020లో తనకు గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయిందని హంసానందిని వెల్లడించింది. ఆమె తల్లి కూడా 18 సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్‌తో పోరాడింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె మహమ్మారి చేతిలో ఓడిపోయారు. అయితే హంసానందిని మాత్రం ధైర్యంగా.. మనోస్థైర్యంతో ఉంటూ చికిత్స తీసుకున్నారు. తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత భయం, గందరగోళం, ఆందోళన అన్నీ తనను చుట్టుముట్టాయని.. వరుసగా స్కానింగ్స్ , పరీక్షల తర్వాత ఆమె ధైర్యంగా శస్త్రచికిత్స చేయించుకుంది కణితిని తొలగించుకున్నారు. క్యాన్సర్ వ్యాప్తి లేనప్పటికీ అవసరమైన 16 సైకిళ్ల కీమోథెరపీని కూడా ఆమె ధైర్యంగా చేయించుకున్నారు. ఈ కష్టకాలం ముగిసిందని భావిస్తున్న సమయంలో ఆమెకు BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్)కి పాజిటివ్ గా నిర్ణారణ అయ్యింది. దీని అర్థం ఆమె జన్యు పరివర్తనను కలిగి ఉంది. అంటే ఆమె జీవితంలో మరోసారి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 70% ఉంది. దీంతో ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక మార్గం చాలా ఇన్వాసివ్ ప్రొఫిలాక్టిక్ సర్జరీలు, ఆమె గత సంవత్సరం చేయించుకుంది.

మనోస్థైర్యమే ఆయుధం..

కఠినమైన చికిత్సలు, ఎన్నో సవాల్లతో కూడిన ఈ క్యాన్సర్ మహమ్మారిని తన జీవిత గమ్యానికి నిర్ధేశించకూడదని భావించిన హంసానందిని తనకు తానుగా కొన్ని వాగ్దానాలు చేసుకుంది. వ్యాధి తన జీవితాన్ని నిర్ధేశించకుండా, చిరునవ్వుతో పోరాడింది. తిరిగి వెండి తెరపై తనను తాను చూసుకోవాలని .. ఇతరులకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి .. వారిలో స్పూర్తి నింపేల తన కథను చెప్పాలని వాగ్దానం చేసుకున్నట్లు తెలిపింది. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకొని ఏడాదిన్నర అయ్యింది. హంసానందిని ఇప్పటికీ తన వాగ్దానాలకు కట్టుబడి ఉంది. ఆమె తన ఆరోగ్యకరమైన, పూర్తిగా సజీవ స్థితిని మూడు కారకాలకు ఆపాదించింది. అందులో ముందస్తు రోగనిర్ధారణ, సమర్థులైన వైద్యులు ,ఆమె కుటుంబ సభ్యుల సహాయక నెట్‌వర్క్. సానుకూల మనస్తత్వం.

ఇవి కూడా చదవండి

మళ్లీ తెరపై మెరవాలని..

గతేడాది నవంబర్‌లో హంసానందిని సినిమా షూటింగ్ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుత ఆమె అనేక ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో బిగ్ స్క్రీన్ పై మెరవాలని ఎదురుచూస్తోంది. చికిత్స తర్వాత సెట్స్‌లో ఆమె అనుభవం గురించి అడిగినప్పుడు.. “నేను కెమెరా ముందు చాలా ఉత్సాహంగా ఉండాలని భావించాను… సెట్స్‌కి తిరిగి రావడం నేను ఊహించిన దానికంటే ఎక్కువ జయించినట్లుగా అనిపించింది. నేను ఇంతకు ముందు అనుభవించిన దానికంటే నేను ఇప్పుడే మరింత బలంగా, మరింత శక్తివంతంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ భయంకరమైన వ్యాధికి వ్యతిరేకంగా హంసానందిని చేసిన సాహసోపేతమైన పోరాటం ఆమె అభిమానులలో.. అలాగే సెట్‌లో ఆమెకు ‘యోధుడు’ & ‘ఫైటర్’ అనే మారుపేర్లను సంపాదించిపెట్టింది.

తల్లిపేరుతో క్యాన్సర్ ఫౌండేషన్..

స్వీయ చెకప్‌లు, రెగ్యులర్ మామోగ్రఫీ, జన్యు పరీక్షల ద్వారా ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ గురించి ఇతరులకు అవగాహన కల్పించడానికి తనను తాను అంకితం చేసుకోవాలని నిర్ణయించుకుంది. రొమ్ము క్యాన్సర్ నిర్వహణ, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాల గురించి సమాచారాన్ని భారతదేశం అంతటా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడం ఆమె లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీని గురించి అడిగినప్పుడు ” ప్రస్తుతం నేను జీవించి ఉన్నందుకు.. ఇక్కడ ఇలా మీ ముందు ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కీమోథెరపీ సమయంలో నేను ప్రతి క్షణాన్ని నా చివరిదిగా భావించాను. నేను చూసిన దానికంటే మరింత మెరుగ్గా ఈ ప్రపంచాన్ని చూడాలని నాకు నేను వాగ్దానం చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి మరణించిన నా తల్లి పేరు మీద ‘యామినీ క్యాన్సర్‌ ఫౌండేషన్‌’ని నెలకొల్పుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అని హంసానందిని వెల్లడించారు.