AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అల్లు అర్జున్ సినిమాలో సాయి పల్లవి పవర్‏ఫుల్ రోల్ ?.. మరోసారి తెరపైకి న్యాచురల్ బ్యూటీ.. 

కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Sai Pallavi: అల్లు అర్జున్ సినిమాలో సాయి పల్లవి పవర్‏ఫుల్ రోల్ ?.. మరోసారి తెరపైకి న్యాచురల్ బ్యూటీ.. 
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2023 | 11:41 AM

Share

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో పుష్ప ఒకటి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ పక్కా ఊరమాస్ స్మగ్లర్ పాత్రలో అదరగొట్టింది. బన్నీ నటనపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, అనసుయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు. కంటెంట్.. మ్యూజిక్ పరంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సిక్వెల్‏గా రాబోతున్న పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మరింత గ్రాండియర్‏గా ఆవిష్కరించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం సినిమాలో మరిన్ని పాత్రలను సృష్టించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలలో కనిపించనున్నారని టాక్ నడిచింది. అయితే వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక అంతేకాకుండా.. ఇందులో ఓ కీలకపాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందని గతంలో అనేక సార్లు ప్రచారం నడిచింది. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని సాయి పల్లవి టీం క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి పుష్ప 2 కోసం సాయి పల్లవి తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

సహజనటనతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. స్టోరీ ఇంపార్టెంట్ చూసి ప్రాజెక్ట్స్ సెలక్ట్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. చివరిసారిగా సాయిపల్లవి గార్గి చిత్రంలో కనిపించింది. ఈ మూవీ తర్వాత ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ ప్రకటన రాలేదు. దీంతో ఆమె సినిమాలకు స్వస్తి పలికి.. ఇక డాక్టర్ చదువు కొనసాగించాలనుకుంటుందని.. చెల్లెలుతో కలిసి సొంతంగా హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి. అలాగే అటు మంచి కథలు వస్తే చేసేందుకు కూడా సాయి పల్లవి రెడీగానే ఉందని టాక్ నడిచింది.

ఈ క్రమంలోనే ఇటీవల పుష్ప 2 సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిని సంప్రదించారని.. ఇక స్టోరీ.. పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్వరలోనే సాయి పల్లవి పుష్ప 2 సెట్ లో జాయిన్ కానుందట. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్