Tollywood: హృతిక్‌తో స్టెప్పులు, ఆపై బోల్డ్ సిరీస్‌తో రచ్చ.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా

ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న హీరో నితిన్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌పైకి ఎక్కించిన సినిమాలలో ఒకటి 'గుండె జారి గల్లంతయ్యిందే'. దర్శకుడు విజయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

Tollywood: హృతిక్‌తో స్టెప్పులు, ఆపై బోల్డ్ సిరీస్‌తో రచ్చ.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 20, 2024 | 9:01 PM

నితిన్ హిట్ సినిమాల్లో ఒకటి ‘గుండె జారి గల్లంతయ్యిందే’. దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ సాధించడమే కాదు.. ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నితిన్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. 2013లో విడుదలైన ఈ మూవీలో నిత్యామీనన్, ఇషా తల్వార్ హీరోయిన్లుగా నటించారు. ఇషాకు ఇదే తొలి తెలుగు చిత్రం కాగా.. ఇది హిట్ కొట్టినప్పటికీ.. ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఇందులో ఇషా తల్వార్‌కు డబ్బింగ్ చెప్పింది హీరోయిన్ నిత్యామీనన్. మరి ఇషా తల్వార్ ప్రస్తుతం ఏం చేస్తోందో తెల్సా..

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

ఇవి కూడా చదవండి

మోడలింగ్ ద్వారా కెరీర్ ఆరంభించిన ఇషా తల్వార్.. తొలినాళ్లలో 40కిపైగా బ్రాండ్స్‌లో నటించింది. అటు ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి.. హీరోయిన్‌గా ‘తట్టతిన్ మరయతు’ అనే మలయాళ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మైనే ప్యార్ కియా’, ‘రాజా చెయ్యి వేస్తే’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఇషా తల్వార్.. ఎక్కువగా మలయాళం సినిమాల్లో మెరిసింది.

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

మరోవైపు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో మాధురి యాదవ్ పాత్రతో బాగా ఫేమస్ అయిన ఈ బోల్డ్ బ్యూటీ.. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

View this post on Instagram

A post shared by Isha Talwar (@talwarisha)

View this post on Instagram

A post shared by Isha Talwar (@talwarisha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి