- Telugu News Entertainment Tollywood Guess This Heroine in This Photo, Now She Is Most Trending in Social Media, Her Name Is Priyanka Chopra
Actress : వయసు 43 సంవత్సరాలు.. ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజ్ చూస్తే..
ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కొన్నేళ్లగా సినీరంగంలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని డిమాండ్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?
Updated on: Nov 20, 2025 | 2:16 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్. హిందీ, ఇంగ్లీష్ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె గ్లోబల్ బ్యూటీ. ఒక్కో సినిమకు దాదాపు 30 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ ప్రియాంక చోప్రా. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ అడ్వెంచరస్ సినిమా వారణాసిలో కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీని రూపొందిస్తున్నారు.

ఇందులో మందాకిని పాత్రలో నటిస్తుంది ప్రియాంక చోప్రా. అయితే ఈ చిత్రానికి ఆమె దాదాపు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా పాత ఫోటో అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఆమె 10వ తరగతి నాటిదని తెలుస్తోంది.

"యుఎస్‌లో ఆమె స్కూల్ డేస్ నుండి ప్రియాంక చోప్రా ఫోటో దొరికింది" అని అంటూ నెట్టింట షేర్ చేస్తున్నారు. ఆఫోటోలో ప్రియాంక గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే ప్రియాంక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయిన ప్రియాంక.. ఇప్పుడు మహేష్ బాబు జోడిగా వారణాసి చిత్రంలో నటిస్తుంది.




