Tollywood: కలువ కళ్లకు కాటుక దిద్దుతున్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టండి.. వెండితెరపై అందాల జాబిలమ్మ..
మెగాస్టార్ చిరంజీవి నుంచి.. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మకు ఓ బాబు జన్మించగా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఎవరో గుర్తుపట్టండి.

ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. ఫాలోవర్లతో చిట్ చాట్ జరుపుతున్నారు. అలాగే త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ లో భాగంగా చిన్ననాటి పిక్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బ్యూటీకి సంబంధించిన బ్యూటీఫుల్ పిక్చర్ తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. కలువ కళ్లకు కాటుక దిద్దుతున్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టండి.. ఆమె వెండితెరపై అందాల జాబిలమ్మ.. తెలుగు ప్రేక్షకుల మనసులు దొచిన ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి నుంచి.. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మకు ఓ బాబు జన్మించగా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. తనే వెండితెర చందమామ కాజల్.
2007లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నటించిన చందమామ సినిమాతో ఫుల్ క్రేజ్ అందుకుంది. ఈ మూవీతో తెలుగులో కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూతో 2020లో ఏడడుగులు వేసింది. వీరికి బాబు నీల్ కిచ్లూ ఉన్నాడు.




ఇక ఇప్పుడిప్పుడే కాజల్ రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె నందమూరి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




