Tollywood: ఈ ఫోటోస్‏లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తుపట్టండి.. ఒక్కసినిమాతోనే కుర్రాళ్లను ఆగం చేసింది..

అందులో మనకు సుపరిచితమైన ఓ హీరోయిన్ కూడా ఉంది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మనసు దొచుకుంది. వెండితెరపై ఆ ముద్దుగుమ్మ కనిపిస్తే తన అందం చూసి అసూయ పడిన అమ్మాయిలు కూడా ఉన్నారు.

Tollywood: ఈ ఫోటోస్‏లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తుపట్టండి.. ఒక్కసినిమాతోనే కుర్రాళ్లను ఆగం చేసింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 12, 2023 | 9:27 PM

ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అందం, అభినయంతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత అరకొర సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. అందులో మనకు సుపరిచితమైన ఓ హీరోయిన్ కూడా ఉంది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మనసు దొచుకుంది. వెండితెరపై ఆ ముద్దుగుమ్మ కనిపిస్తే తన అందం చూసి అసూయ పడిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే వేగంగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యింది. స్టార్ హీరోయిన్‏గా వెలగాల్సిన ఆ అమ్మడు.. అనుకోని వివాదాలతో వార్తలలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఫలితంగా ఆఫర్స్ రాకపోవడంతో చాలా కాలం సినిమాలకు దూరంగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఆ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ మాత్రం నెట్టింట్లో వైరలవుతున్నాయి. పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది ఆ హీరోయిన్. పైన ఫోటోస్ చూశారు కదా..అందులోనే ఆ చిన్నది కూడా ఉంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ చిత్రాలలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. ఈ సినిమాలో ఎంత క్యూట్ గా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. బొద్దుగా చూడ చక్కని అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్వేత.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కాస్కో, రైడ్, కలవర్ రాజు, నువ్కక్కడుంటే నేనక్కడుంట వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఫస్ట్ మూవీతోనే అభిమానులను సంపాదించుకున్న శ్వేత.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో ఈ ముద్దగుమ్మకు ఆఫర్స్ దూరమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది శ్వేత బసు ప్రసాద్. ఇటీవలే క్రిమినల్ జస్టిస్ సీజన్ 3 వెబ్ సిరీస్ లో నటించింది శ్వేత.. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసక్యూటర్ పాత్రలో కనిపించింది.తాజాగా తన స్నేహితులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిన ఫోటోస్ షేర్ చేసింది. అందులో శ్వేత గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆమె లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.