Tollywood: ఈ కుర్రాడు ఒకప్పుడు టాలీవుడ్ హీరో.. కళాత్మక మేధావి ఎవరో గుర్తుపట్టండి..
ఒకప్పుడు టాలీవుడ్ హీరో. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. హీరోగా మెప్పించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత సహయ నటుడిగానూ కనిపించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. భారతనాట్యం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కళాత్మక మేధావి అనే బిరుదు సైతం ఉంది. అలాగే ఆయన కజిన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
![Tollywood: ఈ కుర్రాడు ఒకప్పుడు టాలీవుడ్ హీరో.. కళాత్మక మేధావి ఎవరో గుర్తుపట్టండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/actor-6.jpg?w=1280)
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఒకప్పుడు టాలీవుడ్ హీరో. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. హీరోగా మెప్పించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత సహయ నటుడిగానూ కనిపించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. భారతనాట్యం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కళాత్మక మేధావి అనే బిరుదు సైతం ఉంది. అలాగే ఆయన కజిన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం ఆమె సైతం నాట్యం శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. ఎవరో గుర్తుపట్టగలరా ?. అతను ఒకప్పటి హీరో వినీత్. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
కేరళలో జన్మించిన వినీత్.. 1993లో జెంటిల్ మేన్ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1994లో సరిగమలు సినిమాలో నటించారు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 1996లో విడుదలైన ప్రేమదేశం సినిమా హీరోగా వినీత్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అబ్బాస్ సైతం హీరోగా నటించగా.. టబు కథానాయికగా నటించింది. ఆ తర్వాత రుక్మిణి, w/o వి.వరప్రసాద్, టు లేడీస్ అండ్ జెంటిల్మేన్, నీ ప్రేమకై చిత్రాల్లో నటించారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/emargency.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/nikhil-11.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/keerthy-suresh-ranveer-sin.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/gunturu-karam-1.jpg)
కేవలం హీరోగానే కాకుండా.. లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి, రంగ్ దే చిత్రాల్లో సహయ నటుడిగా నటించి మెప్పించారు. ఓవైపు సినిమాల్లో నటిస్తునే.. మరోవైపు భారత నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వినీత్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.