AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్.. ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. గుర్తు పట్టారా?

పుట్టింది కాకినాడ.. పెరిగింది హైదరాబాద్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ నటుల్లో ఇతను కూడా ఒకరు. యాక్టింగ్, డైరెక్షన్, సినిమా స్క్రిప్ట్ రైటింగ్, డబ్బింగ్.. ఇలా పలు విభాగాల్లోనూ ఈ నటుడికి ప్రావీణ్యం ఉంది. మరి ఈ నటుడెవరో గుర్తు పట్టారా?

Tollywood: మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్.. ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Mar 19, 2025 | 8:16 AM

Share

పై ఫొటోలో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ అదరగొడతాడు. సపోర్టింగ్ రోల్స్ తోనూ మెప్పిస్తాడు. ఇక డైరెక్టర్ గానూ, రచయితగానూ సత్తా చాటాడు. ఇతని ప్రతిభ ఏపాటిదంటే..అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశాడు. పెరిగింది కాకినాడ అయినా హైదరాబాదులో పెరిగాడు. విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా తదితర నగరాల్లో కూడా కొద్ది రోజులున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. కొద్ది రోజుల పాటు ప్రఖ్యాత ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. స్క్రీన్ రైటింగ్, సినిమా సంబంధిత కోర్సులు పూర్తి చేశాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగానూ సక్సెస్ అయ్యాడు. మరి ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు..నూటొక్క జిల్లాల అందగాడు శ్రీనివాస్ అవసరాల. బుధవారం ( మార్చి 19) ఈ నటుడి పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అవసరాలకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అదే క్రమంలో ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

2008 లో విడుదలైన అష్టా చమ్మా సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ అవసరాల. మొదటి సినిమాలోనే తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిల్ల జమీందార్, అంతకు ముందు.. ఆ తర్వాత, ఎవడే సుబ్రమణ్యం, ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంద, నాన్నకు ప్రేమతో, జెంటిల్ మెన్, అమీ తుమీ, గోల్కండ హైస్కూల్, మేడ మీద అబ్బాయి, నూటొక్క జిల్లాల అందగాడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

శ్రీనివాస్ అవసరాల లేటెస్ట్ ఫొటో..

ఇక ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలతో దర్శకుడిగానూ సత్తా చాటాడు శ్రీనివాస్ అవసరాల. బ్రహ్మాస్త్రం వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం ఎక్కువగా నటుడిగానే కనిపిస్తున్నాడు అవసరాల.

సేవా కార్యక్రమాల్లోనూ శ్రీనివాస్ ముందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్