AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:ఈ చిన్నారిని గుర్తు పట్టారా? మొన్నటివరకు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..ఇప్పుడేమో సినిమా ఛాన్సుల్లేక..

బాలల దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా పలువురు హీరోలు, హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. మళ్లీ అప్పటి మధుర క్షణాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నారు. అలా చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక స్టార్ హీరోయిన్ షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Tollywood:ఈ చిన్నారిని గుర్తు పట్టారా? మొన్నటివరకు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..ఇప్పుడేమో సినిమా ఛాన్సుల్లేక..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 15, 2024 | 5:08 PM

Share

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఇలా తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తమిళంలో విజయ్ దళపతితో కలిసి నటించింది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ తో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. ఈ బ్యూటీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా ఈ బ్యూటీకి బ్యాడ్ లక్ నడుస్తోంది. చేసిన సినిమాలన్నీ బోల్తా పడుతున్నాయి. ఫలితంగా ఈ క్రేజీ హీరోయిన్ కు క్రమంగా ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. ఇప్పుడీ ట్యాగ్ ను చెరిపేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోందీ అందాల తార. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించేందుకు రెడీ అవుతోంది. మరి ఈ క్యూటీ ఎవరో చాలామందికి అర్థమై ఉంటుంది. యస్. ఆమె మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ క్రేజీ హీరోయిన్ బాలల దినోత్సవం సందర్భంగా ఒక వీడియోను షేర్ చేసింది. తన చిన్నతనంలో ఒక పెళ్లి వేడుకల్లో దిగిన ఫొటోలని పంచుకుంది. అలాగే ఆ పెళ్లిలో తను చేసిన అల్లరి పనులను కూడా పంచుకుంది.

‘మన లైఫ్ లో మనకి ఇష్టమైన వధువును విడిచిపెట్టి వెళ్లలేం. వాళ్ల పెళ్లిలో వరుడు కంటే ఎక్కువ ఫోటోలు ఒక చిన్నారివి ఉంటాయి. ఆ చిన్నారి నేనే.. మీ మనసులోని చిన్నారిని ఎప్పటికీ మర్చిపోకండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే ‘ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది పూజ. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

పూజా హెగ్డే షేర్ చేసిన వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్‌ కపూర్ తో కలిసి ‘దేవ’ అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ 69వ చిత్రం, సూర్య 44వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అయితే ఆచార్య (2022) తర్వాత తెలుగులో ఒక్క సినిమాలోనూ కనిపించలేదు పూజా హెగ్డే.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..