Tollywood: ఈ ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు గుర్తుపట్టారా.? మాస్‌లో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్..
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఇందులో ఓ స్టార్ హీరో ఉన్నారు. ఆయన ఎవరో గుర్తుపట్టారా.! ఇది ఆ హీరో స్కూల్ రోజుల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి తీసుకున్న ఫోటో.
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఇందులో ఓ స్టార్ హీరో ఉన్నారు. ఆయన ఎవరో గుర్తుపట్టారా.! ఇది ఆ హీరో స్కూల్ రోజుల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి తీసుకున్న ఫోటో. ఆయన ఓ ఇండస్ట్రీకి మకుటం లేని స్టార్. మాస్‌లో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరుసగా ఫ్లాప్స్ అందుకున్నా కూడా.. బాక్సాఫీస్ దగ్గర ఆయన ఓ పవర్ హౌస్. లవర్ బాయ్‌గా తన సినీ కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు మాస్ హీరోగా ప్రతీ సినిమాకు రికార్డు కలెక్షన్లు దక్కించుకుంటున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో. ఎవరో గుర్తుపట్టండి.
అందులో ఉన్న హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. తమిళ తంబీలు అజిత్‌ను ముద్దుగా ‘తలా’ అని పిలుచుకుంటారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అజిత్.. టెన్త్ డ్రాప్‌ఔట్ అయ్యి.. ఆ తర్వాత మెకానిక్‌గా పనిలో చేరారు. అనంతరం ఓ మోటర్ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. కెమెరామెన్ పీ.సీ. శ్రీరామ్ అజిత్‌ను చూసి హీరో అవుతాడని అనుకున్నారు. 1993లో అటు తెలుగు, ఇటు తమిళంలో ‘ప్రేమ పుస్తకం’, ‘అమరావతి’ చిత్రాలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన కెరీర్‌లో వరుసగా ఫెయిల్యూర్స్ అందుకున్నా.. ఆ వెంటనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ దక్కించుకున్నారు అజిత్. ‘వాలీ’, ‘బిల్లా’, ‘మంకత’, ‘ఆరంభం’, ‘వీరమ్’, ‘ఎన్నై అరిందాల్’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘తునివు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు 52వ ఏటలోకి అడుగుపెట్టిన అజిత్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
View this post on Instagram