Tollywood: ఈ రెండు జళ్ల సీతను గుర్తు పట్టారా? బాలీవుడ్ టు టాలీవుడ్.. స్టార్ హీరోల ఫేవరెట్ హీరోయిన్
పై ఫొటోలో రెండు జడలు వేసుకుని క్యూట్ గా కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? పోలికలు చూసి చెప్పేయడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఈ చిన్నారి ఇప్పుడు ఎంతో బ్యూటీఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఎంతలా అంటే.. బాలీవుడ్ టు టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ ఈ ముద్దుగుమ్మ వెంటే పడుతున్నారు.
పై ఫొటోలో రెండు జడలు వేసుకుని క్యూట్ గా కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? పోలికలు చూసి చెప్పేయడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఈ చిన్నారి ఇప్పుడు ఎంతో బ్యూటీఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఎంతలా అంటే.. బాలీవుడ్ టు టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ ఈ ముద్దుగుమ్మ వెంటే పడుతున్నారు. తల్లి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్గుగుమ్మ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ క్యూటీ త్వరలోనే టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టనుంది. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతో. ఈ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో అప్పుడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ రెండు జళ్ల సీత మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
పారిస్ ఫ్యాషన్ వీక్ పరేడ్ లో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఫొటోస్ ఇదిగో..
View this post on Instagram
దీంతో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ జాన్వీ కపూర్ నే హీరోయిన్. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసింది. దీంతో ఈ జూనియర్ శ్రీదేవిని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా? అని తెలుగు జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.