Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పటి క్రేజీ హీరోయిన్.. క్లాసికల్ డ్యాన్సర్ కూడా
పై ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె ఒకప్పటి సౌతిండియన్ హీరోయిన్. తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. సహజ నటిగా అందరి మన్ననలు అందుకుంది. తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ పాత్రల్లోనే కనిపించిందీ అందాల తార. అదే సమయంలో గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది.
పై ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె ఒకప్పటి సౌతిండియన్ హీరోయిన్. తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. సహజ నటిగా అందరి మన్ననలు అందుకుంది. తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ పాత్రల్లోనే కనిపించిందీ అందాల తార. అదే సమయంలో గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. చిన్నప్పటి నుంచి భరత నాట్యంలో శిక్షణ పొందిన ఈ నటి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లోనే ఒక ర్యాంప్ వాక్ లో పాల్గొన్న ఫొటోలు ఒక ప్రముఖ దర్శకుడి కంట పడడంతో ఈ నటి సినిమా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దక్షిణాదితో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి పోలీకలు చూసి ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టచ్చు. ఈమె మరెవరో కాదు ఒకప్పటి అందాల నటి.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేవతి. సోమవారం (జులై 08) ఆమె పుట్టిన రోజు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ నటికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే సందర్భంగా రేవతికి సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
డైరెక్టర్ రేలంగి నరసింహరావు తెరకెక్కించిన ‘మానసవీణ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రేవతి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘గాయం’లో నటించి మెప్పించింది. అలాగే వెంకటేశ్ సరసన నటించిన ప్రేమ సినిమా అప్పట్లో యువతను బాగా అలరించింది. నార్త్ టు సౌత్ పలు హిట్ సినిమాల్లో నటించిన రేవతి 1986లో సురేష్ చంద్ర మీనన్ తో పెళ్లిపీటలెక్కింది. అయితే 2013లో వీరిద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ.. బిజీగా ఉంటుందామె. లోఫర్, సైజ్ జీరో, మేజర్ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది రేవతి. ఇక దర్శకురాలిగా కూడా తనదైన ముద్రవేసుకుంది
Join us in wishing the evergreen & versatile actress #Revathi a very Happy Birthday! Wishing you good health & happiness always#HBDRevathi #KollywoodCinima #HappyBirthdayRevathi pic.twitter.com/3E9DxVa8lf
— Kollywood Cinima (@KollywoodCinima) July 8, 2024
Wishing the versatile actress #Revathi a very Happy Birthday…#HBDRevathi #HappyBirthdayRevathi #Reviewrowdies pic.twitter.com/H4qGZesbZ5
— Review Rowdies (@review_rowdies) July 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.