Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. అందం, అభినయం ఉన్నా అదృష్టం నిల్.. గుర్తు పట్టారా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ కావాల్సిందే. అయితే వీటితో పాటు ఆవగింజంత అదృష్టం కూడా తోడు కావాలి. అప్పుడే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రాణిస్తారు. అందం, అభినయం ఉండి లక్ లేక సినిమా ఇండస్ట్రీలో వెనకబడిన సినిమా తారలు ఎందరో ఉన్నారు

Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. అందం, అభినయం ఉన్నా అదృష్టం నిల్.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us

|

Updated on: Jun 15, 2024 | 7:58 PM

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ కావాల్సిందే. అయితే వీటితో పాటు ఆవగింజంత అదృష్టం కూడా తోడు కావాలి. అప్పుడే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రాణిస్తారు. అందం, అభినయం ఉండి లక్ లేక సినిమా ఇండస్ట్రీలో వెనకబడిన సినిమా తారలు ఎందరో ఉన్నారు. అప్పుడప్పుడు హిట్లు పడినా కెరీర్ మాత్రం నత్త నడకన సాగుతూ ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ఈ ముద్దుగుమ్మ దక్షిణాది ఇండస్ట్రీలో బాగా ఫేమస్. పేరుకు తమిళ అమ్మాయే అయినప్పటికీ అందం, అభినయంతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తమిళ్, తెలుగులో సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. కానీ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఫలితంగా స్టార్ హీరోయిన్ హోదా దక్కడం లేదు. పోలికలు చూసి ఈ ముద్దుగుమ్మను సులభంగా గుర్తు పట్టవచ్చు. మరి మీరు గుర్తు పట్టారా? లేదా కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ అందాల తార మరెవరో కాదు మేఘా ఆకాశ్.

చెన్నైకు చెందిన మేఘా ఆకాశ్ 2017లో లై అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అందం, అభినయం పరంగా చెన్నై చంద్రానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ వెంటనే చల్ మోహన్ రంగా మూవీలో నటించింది. ఇది కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ సినిమాలు మాత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచాయి. వీటి తర్వాత రాజ రాజ చోర, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, ప్రేమ దేశం వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ స్టార్ డమ్ రాలేదు. రవితేజ రావణాసుర లో కాస్త నెగెటివ్ రోల్ చేసింది. అలాగే బూ, మను చరిత్ర వంటి సినిమాలు చేసినా బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు. దీంతో స్టార్ హీరోయిన్ ట్యాగ్ కు చాలా దూరంలో ఆగిపోయింది మేఘా ఆకాశ్. ప్రస్తుతం ఈ సొగసరి చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇందులో రెండు తెలుగు సినిమాలు కాగా మరొకటి తమిళ ప్రాజెక్టు. మరి వీటితో నైనా మేఘా ఆకాశ్ రాత మారుతుందని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి

మేఘా ఆకాశ్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..