Tollywood: ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ స్టార్ విక్రమ్ చియాన్, ధనుష్ సరసన నటించింది. వరుసగా టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీకి అంతగా స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఒకటి రెండు చిత్రాల్లో నటించి సైలెంట్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు. కానీ వ్యక్తిగత విషయాలతో మాత్రం ఈ హీరోయిన్ తెగ ఫేమస్ అయిపోయింది.

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?. తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ స్టార్ విక్రమ్ చియాన్, ధనుష్ సరసన నటించింది. వరుసగా టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీకి అంతగా స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఒకటి రెండు చిత్రాల్లో నటించి సైలెంట్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు. కానీ వ్యక్తిగత విషయాలతో మాత్రం ఈ హీరోయిన్ తెగ ఫేమస్ అయిపోయింది. ప్రేమ, పెళ్లికి కాకుండానే తల్లి కావడం.. ఆ తర్వాత ప్రియుడితో బ్రేకప్.. మళ్లీ ప్రేమ ఇలా కొద్ది రోజుల క్రితం నిత్యం వార్తలలో నిలిచింది. తనే హీరోయిన్ అమీ జాక్సన్.
అమీ జాక్సన్.. బ్రిటన్ కు చెందిన భారతీయ నటి. తమిళ్, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. 16 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. 2009లో మిస్ టీన్ వరల్డ్.. 2010 మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది. ఆ తర్వాత 2010లో మద్రాసపట్టిణంలో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో ఏక్ దీవానా థా సినిమాలో నటించింది. దీంతో ఈ బ్యూటీకి ఇటు తెలుగులోనూ ఆఫర్ వచ్చింది.
View this post on Instagram
2012లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, విక్రమ్ చియాన్ కాంబోలో వచ్చిన ఐ చిత్రంలో నటించింది. ఈ మూవీ తర్వాత అమీ జాక్సన్ కు అవకాశాలు అంతగా రాలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం సొంత దేశంలో ఉన్న అమీ జాక్సన్.. తాజాగా షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. అందులో జుట్టునంతా కత్తిరించుకుని గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది. అయితే ఏదైనా సినిమా కోసం ఇలా రెడీ అయ్యిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
