Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అందాల తార.. ఈ పవర్ ఫుల్ నటి ఎవరో తెలుసా ?..

ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ నటి ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అందాల తారకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా సరికొత్త దారిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ధనుష్ నటిస్తోన్న రాయన్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టరా ?..

Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అందాల తార.. ఈ పవర్ ఫుల్ నటి ఎవరో తెలుసా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2024 | 1:25 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రాయన్’. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే జనాలలో క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ నటి ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అందాల తారకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా సరికొత్త దారిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ధనుష్ నటిస్తోన్న రాయన్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టరా ?.. తనే వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలు.

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ తొలినాళ్లలో కథానాయికగా అలరించిన ఆమె.. ఆ తర్వాత ఉన్నట్లుండి తన రూటు మార్చేసింది. హీరోయిన్ గా కాకుండా విలనిజం చూపిస్తూ తెరపై అదరగొట్టేస్తుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలలో నటిస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. చివరిసారిగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో కనిపించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు రాయన్ సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఢీ గ్లామర్ లుక్‏లో కనిపిస్తుంది.

ధనుష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆయన సోదరుడు సెల్వరాఘవన్ స్క్రిప్ట్ అందించారని టాక్ నడుస్తోంది. అయితే ఈ రూమర్స్ ను ఖండించారు డైరెక్టర్ సెల్వరాఘవన్. రాయన్ కథను ధనుష్ సొంతంగా రాసుకున్నాడని.. కేవలం తాను ఇందులో నటిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!