Tollywood: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‎ను గుర్తుపట్టగలరా..? అవకాశాలే అందని ముద్దుగుమ్మ..

|

Aug 27, 2024 | 1:32 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ జోడిగా కనిపించిన ఈ బ్యూటీకి.. ఆ తర్వాత తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు. ఒక్క మూవీతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచేసుకున్న ఈ మలయాళీ కుట్టి ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‎ను గుర్తుపట్టగలరా..? అవకాశాలే అందని ముద్దుగుమ్మ..
Heroine
Follow us on

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది ఈ హీరోయిన్. నందమూరి నటసింహం బాలకృష్ణ జోడిగా కనిపించిన ఈ బ్యూటీకి.. ఆ తర్వాత తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు. ఒక్క మూవీతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచేసుకున్న ఈ మలయాళీ కుట్టి ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తనే మలయాళీ బ్యూటీ హానీ రోజ్. పైన ఫోటోలో టీచర్స్ కూర్చున్న పై లైనులో మొదటి అమ్మాయి. ఈ మధ్య కాలంలో అత్యధిక ఓపెనింగ్ వేడుకలకు హాజరైన స్టార్ హనీ రోజ్. ప్రారంభోత్సవాల్లో హనీని మెరిసే తారగా నెట్టింట ఫేమస్ అయ్యింది. వినయనేర దర్శకత్వం వహించిన ‘బాయ్‌ఫ్రెండ్’ సినిమాతో హనీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తరువాత, హనీ త్రివేండ్రం లాడ్జ్, కనల్, వారి రాత్రులు, గాడ్స్ ఓన్ క్లీటస్, చంక్స్, యు టూ బ్రూటస్, ఇట్టిమని: మేడ్ ఇన్ చైనా, బిగ్ బ్రదర్, మాన్స్టర్ వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించింది.హనీ రోజ్ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో యాక్టివ్‌గా ఉంది. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్య భార్యగా కనిపించిన హనీకి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

కానీ ఆ తర్వాత మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు రాలేదు. హనీ నటించిన తాజా చిత్రం ‘రేచెల్’. అబ్రిడ్ షైన్ పోషించిన ఈ చిత్రంలో హనీ విభిన్నమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో హనీరోస్ కసాయిగా కనిపించనుందని తెలిపే పోస్టర్ కూడా గత కొద్దిరోజులుగా విడుదలైంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనంతిని బాల దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.