Tollywood: సౌత్ ఇండస్ట్రీలో చాలా స్పెషల్ ఈ అమ్మాయి.. నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోయిన్..
చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే అభిమానులను ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మాయి నటించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ముద్దుగుమ్మ. తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు.. ?
సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మాయి చాలా స్పెషల్. అందరూ హీరోయిన్స్ మాదిరిగా కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే అభిమానులను ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మాయి నటించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ముద్దుగుమ్మ. తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు.. ? తనే హీరోయిన్ అపర్ణ బాలమురళి. ‘మహేష్ పగ’ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
కోలీవుడ్ హీరో సూర్య నటించిన సురారై పోట్రు సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యింది. ఈ చిత్రానికి గానూ అపర్ణకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది. అపర్ణ తండ్రి బాలమురళి సంగీత విద్యాంసుడు. తల్లి శోభ న్యాయవాది. ఇప్పుడు సోషల్ మీడియాలో అపర్ణ చిన్ననాటి ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అపర్ణ ఒక సెకండ్ క్లాస్ యాత్ర, మహేష్ పగ, ఏరు ముత్తస్సి గాథ, సర్వోపరి పాలక్కరన్, సండే హాలిడే, అకాంబి, బి టెక్, ఆల్ రామేంద్రన్, సర్వం తాళమయం చిత్రాల్లో నటించింది. నటనతో పాటు గాయనిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న నటి అపర్ణ బాలమురళి. ‘సండే హాలిడే’ సినిమాతో గాయనిగా అపర్ణ అరంగేట్రం చేసింది.
ఇటీవలే కోలీవుడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ చిత్రంలో నటించింది. ఇందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ జోడిగా కనిపించింది అపర్ణ. ప్రస్తుతం తమిళంతోపాటు మలయాళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.