Jani Master: జానీ మాస్టర్ విచారణ.. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం..
గురువారం జానీని గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ తీసుకువచ్చి నార్సింగి పోలీసులకు అప్పగించింది SoT డిపార్ట్‌మెంట్. ఈరోజు డీసీపీ ఆఫీస్‌లో జానీమాస్టర్ విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం జానీ మాస్టర్ ను రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో జానీని హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన వివాదంపై డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదం కావడంతో చాలా మంది ఆచీతూచీ స్పందిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. గురువారం జానీని గోవాలో అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ తీసుకువచ్చి నార్సింగి పోలీసులకు అప్పగించారు. డీసీపీ ఆఫీస్‌లో జానీ మాస్టర్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం జానీ మాస్టర్ ను రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు అన్ని అసత్యమే అంటున్నారు ఆయన భార్య అయేషా. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొన్న రేవు పార్టీ అన్నారు.. ఇప్పడు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆ యువతిపై కొన్నేళ్లుగా లైంగిక దాడి జరుగుతుంటే ఇన్నాళ్లు ఆమె ఎందుకు బయటపెట్టలేదని.. 16 ఏళ్లకే రేప్ జరిగితే అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు అయేషా. బాధితురాలికి చాలా మందితో సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జానీ జస్ట్ డాన్స్ మాస్టరే. కానీ ఇప్పుడు ఆయనో అదికారపార్టీలో కీలక సభ్యుడు. అందుకే జానీ మాస్టర్‌పై ఇటు ఇండస్ట్రీ, పాలిటిక్స్‌లో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయేషా.
జానీమాస్టర్ ఏ అమ్మాయినీ వేధించలేదని.. ఇప్పుడు ఫిర్యాదు చేసిన యువతికి చాలా మందితో అఫైర్లున్నాయని ఆరోపించింది. ఎప్పుడూ ఆ అమ్మాయి జానీమాస్టర్ మెప్పుకోసం ప్రయత్నించేదని.. 16 ఏళ్ల సమయంలో రేప్ చేశారన్న ఆధారాలు ఏవి..? జానీమాస్టర్‌ను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం ఇది.. ఈ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉంది అన్నారు జానీ మాస్టర్ భార్య అయేషా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.