Siddharth – Aditi Rao: సిద్ధార్థ్, అదితి ఇళ్లు చూశారా.. ? కార్ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంకే..
సిద్ధార్థ్, అదితి పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరి నెట్ వర్త్, సినిమా రెమ్యునరేషన్స్, ఫ్యామిలీ గురించి సెర్చ్ చేస్తున్నారు. కానీ మీరెప్పుడైనా సిద్ధార్థ్, అదితి ఇళ్లను చూశారా.. ? అంతేకాదు.. ఇద్దరి కార్ కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే. వీరిద్దరు సినీరంగంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని తమకంటూ
టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వనపర్తిలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. ఇరువురి కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో సింపుల్ గా వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. దీంతో సిద్ధార్థ్, అదితి పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరి నెట్ వర్త్, సినిమా రెమ్యునరేషన్స్, ఫ్యామిలీ గురించి సెర్చ్ చేస్తున్నారు. కానీ మీరెప్పుడైనా సిద్ధార్థ్, అదితి ఇళ్లను చూశారా.. ? అంతేకాదు.. ఇద్దరి కార్ కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే. వీరిద్దరు సినీరంగంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు.
ముఖ్యంగా సిద్ధార్థ్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. సిద్ధార్థ్ చెన్నైలో జన్మించాడు. అక్కడే సొంతంగా విలాసవంతమైన ఇళ్లు కూడా ఉంది. అలాగే హైదరాబాద్, ముంబైలోనూ ఇళ్లు ఉన్నట్లు సమాచారం.
View this post on Instagram
View this post on Instagram
అలాగే అదితికి ముంబైలోని వెర్సోవాలో ఒక అద్భుతమైన లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోస్ అదితి ఇన్ స్టాలో ఉన్నాయి. తన ఇంటిని అదితి ఎంతో అందంగా అలంకరించుకుంది. చిన్నతనంలో ఆమె తండ్రి ఆమె కోసం నిర్మించిన డాల్‌హౌస్ నుండి కూడా డిజైన్ ప్రేరణ పొందింది. అదితికి హైదరాబాద్‌లో పూర్వీకుల ఇల్లు కూడా ఉంది. కార్ల విషయానికి వస్తే, అదితి,సిద్ధార్థ్ ఇద్దరూ లగ్జరీ వాహనాలకు పెద్ద అభిమానులే.
అదితి కార్లు..
- ఆడి క్యూ7 (రూ. 1 కోటి)
- Mercedes-Benz GLS (రూ. 1.30 కోట్లు)
- BMW X7 (రూ. 1.30 కోట్లు)
సిద్ధార్థ్ కార్లు..
- రోల్స్ రాయిస్
- మెర్సిడెస్-బెంజ్
- ఆడి A4
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.