Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ సెన్సెషన్.. ఉదయ్ కిరణ్తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ బ్యూటీ నటనకు విమర్శకులు సైతం ముగ్దులయ్యారు. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత అదే హావా కొనసాగించలేకపోయింది. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు, సీరియల్స్ చేస్తూ నార్త్ అడియన్స్ ను అలరిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్, అరుదైన పిక్స్ ట్రెండ్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ టీనేజ్ జ్ఞాపకం ఒకటి మీ ముందుకు తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సెన్సెషన్ హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ బ్యూటీ నటనకు విమర్శకులు సైతం ముగ్దులయ్యారు. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత అదే హావా కొనసాగించలేకపోయింది. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు, సీరియల్స్ చేస్తూ నార్త్ అడియన్స్ ను అలరిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ అనిత హస్సానందాని. అదేనండీ నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత.
దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది అనిత. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో తెలుగు, కన్నడ, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. 2003లో థ్రిల్లర్ మూవీ కుచ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. 2013లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది అనిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనిత.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
కొన్నాళ్లుగా హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన అనిత.. ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో మలయాళీ కుట్టి మాళవిక మనోజ్ కథానాయికగా నటిస్తుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత అనిత తెలుగులో మరిన్ని సినిమాలు చేయడం ఖాయం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.