Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ.. 51 ఏళ్ల వయసులో సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన విజయ్.. ఇప్పుడు తన కొత్త సినిమా రౌడీ జనార్దన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాజాగా విజయ్ గురించి ఓ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటించింది. కింగ్డమ్ తర్వాత విజయ్ చేస్తోన్న సినిమా రౌడీ జనార్థన్. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి మహానటి సినిమాలో నటించారు. ఇప్పుడు ఇద్దరు మొదటిసారి రౌడీ జనార్థన్ చిత్రంలో జంటగా నటించనున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండతో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అంటుంది 51 ఏళ్ల సీనియర్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? తనే గృహలక్ష్మీ సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
తాజాగా ఆమె కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. అన్నమయ్య సినిమాలో అప్పుడు ఎంత అందంగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారంటూ పొగడ్తలు కురిపించింది యాంకర్ వర్ష. ఆ తర్వాత మీ అందనాన్ని ఎలా కాపాడుకుంటున్నారు..? ఎలా మెయింటైన్ చేస్తున్నారు ? .. చందమామకు రెండు పేర్లు ఉన్నాయని మీకు తెలుసా.. ? ఒకటి చందమామ, మరొకటి కస్తూరి అంటూ పొగడ్తలు స్టార్ట్ చేసింది. దీంతో నాకు కంటే నీకే కళ్లజోడు బాగా అవసరం అంటూ కౌంటరిచ్చింది కస్తూరి. ఇక తర్వాత తన పర్సనల్ లైఫ్, పిల్లల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది కస్తూరి. చావును దగ్గర నుంచి నాలుగు సార్లు చూశానని.. ఒక్కసారి కాకపోతే… మరొక్కసారైనా కాలానికి ఓడిపోవాల్సిందే .. మిమ్మల్ని కన్నవాళ్లు పోతే ఆ బాధ వేరు.. కానీ మేం కన్నవాళ్లు చావు బతుకుల మధ్య ఉంటే అది తట్టుకోలేం… నా కూతురిని అలాంటి పరిస్థితుల్లో చూశాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కస్తూరి.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఆ తర్వాత రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే.. విజయ్ దేవరకొండకు సిస్టర్ గా నటిస్తారా ? అని అడగ్గా.. సిస్టర్ రోల్ కాదు.. తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని మరీ అతడితో స్పెషల్ సాంగ్ చేయడానికి నేను రెడీ అంటూ చెప్పింది కస్తూరి. ఇక ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. కస్తూరి ధైర్యమైన మాటలు చూసి ప్రశంసించారు నెటిజన్స్. 51 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?




