Bigg Boss 9 Telugu : హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన అయేషా.. వెళ్తూ వెళ్తూ తనూజకు సలహా..
బిగ్బాస్ సీజన్ 9.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత హౌస్ లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా బంధాలు మధ్య గ్యాప్ వచ్చేసింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పులి పిల్లల అడుగుపెట్టిన అయేషా.. ఆట మధ్యలోనే వదిలేసింది. తాజాగా అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ తనూజకు మంచి సలహా ఇచ్చింది అయేషా.

బిగ్బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి తన ఆట తీరుతో అదరగొట్టేసింది ఆయేషా. రావడంతోనే రీతూ, తనూజ బాండింగ్స్ పై సంచలన కామెంట్స్ చేసి ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. అంతకు ముందు తమిళ బిగ్ బాస్ షోలో 9 వారాలు ఉండి వివాదాస్పద కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, హోస్టును సైతం ఎదురించడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమె ఆట తీరు, మాట తీరుతో విసుగుపోయిన జనాలు తమిళ బిగ్ బాస్ షో నుంచి 9వ వారంలోనే బయటకు పంపించారు. ఇక ఇప్పుడు తెలుగు బిగ్బాస్ షోలోకి రాగానే.. తన నోటికి పనిచెప్పింది. మొదటి వారంలో తనూజ, రీతూలను అటాక్ చేసిన ఆయేషా.. ఆ తర్వాత వారంలో రీతూపై ఏంటే.. అంటూ నోరు పారేసుకుంది. నామినేషన్స్, టాస్కుల సమయంలో గట్టి గట్టిగా అరుస్తూ.. ఏడుస్తూ నానా హంగామా చేసింది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు అర్థాంతరంగా హౌస్ ను విడాల్సి వచ్చింది. బిగ్బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాతి రోజు నుంచి ఆయేషాకు హెల్త్ డిస్ట్రబ్ అ్యయింది. ఫీవర్ తోపాటు ఒళ్లు నొప్పులు కూడా ఉండడంతో మెడికల్ టెస్టులు చేయగా.. టైఫాయిడ్ తోపాటు డెంగ్యూ సైతం పాజిటివ్ అని వచ్చింది. ఇదే విషయాన్ని నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. డాక్టర్ డెంగ్యూ అని చెప్పడంతో తన బెడ్ పై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది ఆయేషా. దీంతో ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశాడు నిఖిల్. ఆ తర్వాత హౌస్ లో వాళ్లంతా వచ్చి ఓదార్చారు.
ఆ తర్వాత రాము రాథోడ్ దగ్గర కూర్చుని నాకు జీవితంలో ఏదీ అంత ఈజీగా రాలేదు. బిగ్బాస్ సెకండ్ ఛాన్స్ ఎవరికీ రాదు. నాకు వచ్చింది. కానీ నా లైఫ్ లో ఏది ఎక్కువగా ప్రేమిస్తానో అది నాతో ఉండదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కన్ఫెషన్ రూంకు ఆయేషాను పిలిచిన బిగ్బాస్.. ఆమె హౌస్మేట్స్ ఆరోగ్యం కోసం తనను హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు చెప్పాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆయేషా. ఇక వెళ్తూ వెళ్తూ తనూజకు జాగ్రత్తలు చెప్పింది. మళ్లీ ఫేక్ దాంట్లో పడొద్దు.. ఇదొక్కడే చెప్తున్నాను అంటూ తనూజకు జాగ్రత్తలు, సలహాలు చెబుతూ వెళ్లిపోయింది. మొత్తానికి ఫైర్ బ్రాండ్ లా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయేషా.. హెల్త్ డిస్ట్రబ్ కావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..




