Bhimaa Review : భీమా మూవీ రివ్యూ.. ఈసారి గోపీచంద్ హిట్ కొట్టాడా.? సినిమా ఎలా ఉందంటే

ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో రప్ఫాడించిన గోపీచంద్‌కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. వరసగా మాస్ సినిమాలే చేస్తున్న ఈయన.. తాజాగా మరోసారి యాక్షన్ మూవీతోనే వచ్చాడు. ఈయన నటించిన భీమా సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. శివుడి కాన్సెప్టుతో వచ్చిన భీమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది చూద్దాం..

Bhimaa Review : భీమా మూవీ రివ్యూ.. ఈసారి గోపీచంద్ హిట్ కొట్టాడా.? సినిమా ఎలా ఉందంటే
Bhimaa
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 08, 2024 | 4:57 PM

మూవీ రివ్యూ: భీమా

నటీనటులు: గోపీచంద్, మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్, నాజర్, ముఖేశ్ తివారి, వెన్నెల కిషోర్, నరేష్ తదితరులు

సంగీతం: రవి బస్రూర్

ఎడిటర్: తమ్మిరాజు

సినిమాటోగ్రఫీ: స్వామి జే గౌడ

దర్శకత్వం: ఏ హర్ష

నిర్మాత: కేకే రాధామోహన్

ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో రప్ఫాడించిన గోపీచంద్‌కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. వరసగా మాస్ సినిమాలే చేస్తున్న ఈయన.. తాజాగా మరోసారి యాక్షన్ మూవీతోనే వచ్చాడు. ఈయన నటించిన భీమా సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. శివుడి కాన్సెప్టుతో వచ్చిన భీమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది చూద్దాం..

కథ:

మహేంద్రగిరిలో భవాని(ముఖేష్ తివారి) తిరుగులేని శక్తి.. అతన్ని చూస్తేనే అందరూ భయపడుతుంటారు. ప్రభుత్వ అధికారులైనా.. రాజకీయ నాయకులైనా అంతా భవానీ ముందు జూజూబీ. ఓసారి చెక్ పోస్ట్ దగ్గర అతని లారీ ఆపితే దయ దాక్ష్యణ్యాలు లేకుండా ఓ ఎస్సైను చంపేస్తాడు భవానీ. అప్పుడు ఆ స్థానంలోకి భీమా(గోపీచంద్) వస్తాడు. వచ్చీ రాగానే భవానీ మనుషులపై వీరంగం ఆడతాడు. ఆయన ప్రతీ పనిలోనూ అడ్డు పడుతుంటాడు. అంతేకాదు చేసే పనులన్నీ ఆపేయాలంటూ మాస్ వార్నింగ్ ఇస్తాడు. భీమాని ఎదిరించడానికి భవానీ తన బలగం మొత్తాన్ని మహేంద్రగిరికి దించుతాడు. భవానీ అంతగా ఆ ట్యాంకర్లలో ఏం తరలిస్తుంటాడు.. ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ(నాజర్)కు ఈ కథకు లింక్ ఏంటి..? మధ్యలో పారిజాతం (ప్రియా భవానీ శంకర్), విద్య (మాళవికా శర్మ) ఎక్కడ్నుంచి వచ్చారు..? అనేది మిగిలిన కథ..

కథనం:

హిట్ వచ్చినా.. ఫ్లాప్ వచ్చినా నేను మారేదే లే అంటున్నాడు గోపీచంద్. భీమా చూసాక ఈయన స్టోరీ సెలక్షన్‌పైనే అనుమానాలు వస్తున్నాయి. ఇంకా అదే రొటీన్ మూస ఫార్ములాతో అటాక్ చేస్తున్నాడు ఈ యాక్షన్ హీరో. ఒకప్పుడు కలిసొచ్చిన కథల్నే ఇప్పటికీ నమ్ముకుంటున్నాడు. ఫస్ట్ సీన్‌లోనే క్లైమాక్స్ చెప్పేంత.. ఊర మాస్ రొటీన్ టెంప్లేట్ స్టోరీ భీమా. దీనికి దర్శకుడి హర్ష మేకింగ్ మరింత రొటీన్‌గా మార్చేసింది. అక్కడక్కడా యాక్షన్ సీన్స్ చూసి ఓకే అనుకోవడమే మినహాయిస్తే.. ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సన్నివేశమే లేదు భీమాలో. మళ్లీ ఇందులో ఫాంటసీ అంశాలు ఇరికించడంతో కలగాపులగం అయిపోయింది కథ. ఒకే ఒక్క ట్విస్ట్‌ను నమ్ముకుని సినిమా చేసినట్లు అనిపించింది దర్శకుడు హర్ష. మొదటి 10 నిమిషాలు ఆసక్తికరంగా ఉంటుంది. కానీ తర్వాత హీరోయిన్ ట్రాక్ మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఓకే అనిపించినా.. సెకండాఫ్ మళ్లీ అదే తంతు. శివుడి గుడి గురించి అంత చెప్పి.. చివరికి దాన్నెక్కడా యూజ్ చేసుకోలేదు. క్లైమాక్స్‌లో కూడా గుడిని వాడుకోకపోతే శివయ్య ఫీల్ అవుతాడేమో అన్నట్లు.. తూతూ మంత్రంగా అక్కడే కథ ముగించేసారేమో అనిపించింది. ముఖ్యంగా విలన్ భవానీ గురించి అంత బిల్డప్ ఇచ్చినపుడు ఆయన బ్యాగ్రౌండ్ చూపించాలి.. అందులో దర్శకుడు ఏం చెప్పలేదు. అలాగే రామా, భీమా కారెక్టరైజేషన్స్ కూడా క్లారిటీగా అనిపించదు. ఫస్టాఫ్‌లో గోపీచంద్, మాళవిక మధ్య లవ్ ట్రాక్ సినిమాకు మైనస్ అయిపోయింది. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే అదరగొట్టాడు దర్శకుడు. ట్యాంకర్ల జోలికొస్తే విలన్ అందర్నీ చంపేస్తుంటాడు. కానీ అంత సీరియస్ మ్యాటర్‌ను కూడా కామెడీగానే డీల్ చేసాడు దర్శకుడు. ఇక గోపీచంద్ రెండో పాత్ర అయితే మరీ పీలగా ఉంది. ప్రియా భవానీ శంకర్, గోపీ సీన్స్ కూడా ఆకట్టుకోవు. కేవలం అంటే కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే భీమాకు రక్ష.

నటీనటులు:

గోపీచంద్‌కు ఇలాంటి కారెక్టర్స్ కొట్టిన పిండి.. కానీ ఆ మూసలోంచి బయటికొస్తే మంచిదేమో..? లేదంటే మూసలో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. మాళవిక శర్మ గ్లామర్ షోకు సరిపోయింది.. ప్రియా భవానీ శంకర్ చిన్న రోల్ చేసింది. సీనియర్ నరేష్ ఉన్నంత సేపు డబుల్ మీనింగ్ డైలాగులకే సరిపోయింది. వెన్నెల కిషోర్ కారెక్టర్ ఓకే. విలన్ ముఖేష్ తివారిని కూడా కమెడియన్‌గానే మార్చేసాడు దర్శకుడు హర్ష. మరో కీలక పాత్రలో నాజర్ ఓకే. మిగిలిన వాళ్లంతా పరిధిమేర నటించారు.

టెక్నికల్ టీం:

రవి బస్రూర్ సంగీతం ఓకే. పాటలు ఏమంత గొప్పగా లేవు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. దర్శకుడు ఛాయిస్ కాబట్టి అంతకంటే ఏం చెప్పలేం. లేదంటే ఫస్టాఫ్‌లో చాలా వరకు కత్తెరకు పని పెట్టొచ్చు. స్వామి జే గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక దర్శకుడు హర్ష అయితే.. గోపీచంద్ ఇచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకోలేకపోయాడు. రొటీన్ కథకే ఫాంటసీ జోడించి ఎటూ కాకుండా చేసాడేమో అనిపిస్తుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా భీమా.. ఇంత రొటీన్ స్టోరీతో కష్టమే రామా..

Latest Articles
మద్యం తాగే మహిళలకు షాకింగ్‌ న్యూస్‌.. అమెరికన్‌ అధ్యయనంలో..
మద్యం తాగే మహిళలకు షాకింగ్‌ న్యూస్‌.. అమెరికన్‌ అధ్యయనంలో..
కీలకపోరుకు సిద్ధమైన ఉప్పల్.. చూపులన్నీ ప్లేఆఫ్స్‌ పైనే..
కీలకపోరుకు సిద్ధమైన ఉప్పల్.. చూపులన్నీ ప్లేఆఫ్స్‌ పైనే..
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..