AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ కొంతకాలమే బాగుంటుంది.. ఆతర్వాత వదిలేస్తారు.. గీతూ రాయల్ కామెంట్స్

గీతూ రాయల్ కు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ , ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ ఇలా చాలా ట్యాగ్ లు ఉన్నాయి. బిగ్ బాస్ తర్వాత ఆమె యాంకర్ గా మారింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొంది గీతూ రాయల్. తన మాటలతో యాటిట్యూడ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తనదైన గ్రేమ్ స్ట్రాటజీతో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 లో చాలా కాలమే ఉంది.

ప్రేమ కొంతకాలమే బాగుంటుంది.. ఆతర్వాత వదిలేస్తారు.. గీతూ రాయల్ కామెంట్స్
Geetu Royal
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2024 | 4:49 PM

Share

సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో గీతూ రాయల్ ఒకరు. సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది గీతూ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ కు ముందు గీతూ రాయల్ కు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ , ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ ఇలా చాలా ట్యాగ్ లు ఉన్నాయి. బిగ్ బాస్ తర్వాత ఆమె యాంకర్ గా మారింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొంది గీతూ రాయల్. తన మాటలతో యాటిట్యూడ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తనదైన గ్రేమ్ స్ట్రాటజీతో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 లో చాలా కాలమే ఉంది. ఇక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత .. నేను బిగ్ బాస్ వదిలి వెళ్ళాను అంటూ బోరున ఏడ్చి రచ్చ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు అనుకున్నంత బిజీ కాలేకపోయింది.

బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా వ్యవహరించింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. గీతూ ప్రేమ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గీతూ మాట్లాడుతూ.. ‘మొదట్లో ప్రేమ చాలా బాగుంటుంది. ఆతర్వాత మారిపోతుంది. ఫస్ట్ 6 నెలలు హనీ మూన్ లా ఉంటుంది. ఒకరంటే ఒకరు పడి చచ్చిపోతారు. ఒకరినొదిలి ఒకరు ఉండలేరు. అది నిజమైన ప్రేమ కాదు.  నిజమైన ప్రేమంటే ఏంటో తెలియాలంటే కనీసం ఒక 6 నెలలకు పైగా  ఎదురుచూడాల్సిందే. అప్పటి వరకు ఉండేది కేవలం వ్యామోహం మాత్రమే అని చెప్పుకొచ్చింది. అన్నీ అయిపోయాక ప్రేమ బోర్ కొడుతుంది అంటుంది గీతూ రాయల్. ఒక్కసారి ప్రేమ బోర్ కొడితే కొత్తవారిని వెతుకుంటారు. 6 నెలల తర్వాత కూడా వారు మొదట్లో ఉన్నట్టే ఉంటే వాళ్ళది నిజమైన ప్రేమే.. ఇది నేను ప్రేమికులకు ఇచ్చే ఉచిత సలహా అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Geetu Royal (@geeturoyal_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us