Godse Movie: ప్రేక్షకులకు గాడ్సే చిత్రయూనిట్ ఛాలెంజ్.. అలా చేస్తే బంఫర్ ఆఫర్ మీకే…
డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. బ్రోచేవారెవరురా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు, స్కైలాబ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు గాడ్సే సినిమాతో వెండితెరపై సందడి చేయబోతున్నాడు. డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను సికే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈమూవీ జూన్ 17న విడుదల కాబోతుంది. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.. ఇందులో భాగంగా.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది…
అదేంటంటే.. గాడ్సే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సత్యదేవ్ చెప్పే ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను రీల్ లేదా రీమిక్స్ చేసి #GODSECHALLENGE హాష్ ట్యాగ్ ఉపయోగించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. అందులో బెస్ట్ రీల్స్ ని ఎంపిక చేసి గాడ్సే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు స్క్రీన్ పై ప్రదర్శిస్తామని.. అంతేకాకుండా.. గాడ్సే టీంను కలిసే ఛాన్స్ కల్పిస్తామని తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఓ పవర్ ఫుల్ డైలాగ్ రీల్ చేసేయ్యండి.. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, జియా శర్మ, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాని శాండీ అద్దంకి సంగీతం అందిస్తున్నారు.




ట్వీట్..
#GodseChallenge is here ✅ All you have to do is Reel/Remix to the dialogue and upload it using #GodseChallenge
Best ones will be selected & played at the Pre Release Event. Also Win a Chance to interact with the Cast of the film. Exciting???
Go grab your phones and get going? pic.twitter.com/mNyEpInvAC
— CK Entertainments (@CKEntsOffl) June 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
