Kamal Haasan: సినిమాకు భాష లేదు.. ప్రపంచ భాషే సినిమా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్..

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా విక్రమ్. ఇందులో కమల్ హాసన్ లీడ్ రోల్ పోషించగా.. సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు.

Kamal Haasan: సినిమాకు భాష లేదు.. ప్రపంచ భాషే సినిమా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్..
Kamal Haasan
Follow us

|

Updated on: Jun 12, 2022 | 7:46 AM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి. బాహుబలి సినిమాతో ఇండియన్ సినీ హిస్టరీలో చరిత్ర సృష్టించిన జక్కన్న.. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలో మరోసారి రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కేజీఎఫ్, పుష్ప సినిమాలకు కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తున్నప్పపటికీ విశ్వనటుడు గతంలోనే ఈ ట్రెండ్ సెట్ చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మరో చరిత్ర సినిమా చెన్నైలో ఎలాంటి సబ్ టైటిల్ లేకుండా దాదాపు రెండేళ్లు విజయవంతంగా ప్రదర్శించారు.. తాజాగా ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు కమల్ హాసన్ (Kamal  Haasan). ఆయన ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్‏మీట్ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా విక్రమ్. ఇందులో కమల్ హాసన్ లీడ్ రోల్ పోషించగా.. సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ. 300 కోట్లకు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గోన్న కమల్.. విక్రమ్ చిత్రాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. విక్రమ్ సినిమాని ‘శ్రేష్ఠ్ మూవీస్’ కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారి వల్లే విక్రమ్ ప్రేక్షకులకు భారీగా చేరువైయింది. వీరి వలనే చాలా థియేటర్స్ లో విడుదల, భారీగా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఈ సినిమాని సుధాకర్ రెడ్డికి ఇస్తూ మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నా జాగ్రత్త అని చెప్పా. సుధాకర్ రెడ్డి గారు ఆ బిడ్డని రికార్డ్ బ్రేకింగ్ చైల్డ్ గా చేశారు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ ని అద్భుతంగా తీశారు. ఆయన ఖైదీ చూసి ఒక అవకాశం ఇచ్చాము. ఆ అవకాశాన్ని ఆయన అద్భుతంగా చూపించారు. సినిమా గొప్పగా వుంటుందని తెలుసు, ఇంత గొప్పగా వుండటం సర్ప్రైజ్ గా వుంది. రానా గారి ఎత్తులోనే కాదు విజయాల్లోనూ ఎంతో ఎత్తుకి ఎదిగారు. రానా గారు నాకు టెక్నిషియన్ గా కూడా తెలుసు. రానా గారికి నేను ఎంత ఇష్టమంటే నా సినిమా ఫెయిలైనా కూడా బావుందని మెచ్చుకునేవారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా వెనుక నిర్మాత మహేంద్రన్ గారి కృషి చాలా వుంది. అయితే ఆయన మీడియా ముందుకు ఎక్కువగా రారు. ఆయనకి కృతజ్ఞతలు. విక్రమ్ కి వండర్ ఫుల్ టెక్నిషియన్స్ పని చేశారు. అనిరుద్, గిరీష్ గంగాధరన్.. ఇలా అందరూ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సినిమాలో పాత్రలన్నీటికీ మంచి పేరు రావడం ఆనందంగా వుంది. ప్రేక్షకులు విక్రమ్ ని గొప్పగా ఆదరించారు. మళ్ళీ గొప్పగా స్వాగతం పలికారు. ‘మరో చరిత్ర’ తర్వాత నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ విషయంలో నేను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతగా వుంటాను. మరో చరిత్ర సబ్ టైటిల్స్ లేకుండా చెన్నైలో రెండున్నరేళ్ళు ఆడింది. సినిమాకి భాష లేదు. సినిమాది ప్రపంచ భాష. విక్రమ్ విజయం మరోసారి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. రీపిట్ గా చూస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి అభినందనలే మరో సినిమా ఇంకా గొప్పగా చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి. విక్రమ్ ను బిగ్గెస్ట్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. విక్రమ్ ఎన్ని రికార్డులు సాధించినా దానికి కారణం ప్రేక్షకులే. మీరు లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. నా సినిమానే కాదు మంచి సినిమాలని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి” అని కోరారు.

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!