AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Genelia Deshmukh: ఏంటమ్మా ఆ ఎనర్జీ.. హాసినిని అంటే ఇలాగే ఉంటుంది మరీ.. భర్తతో కలిసి జెనీలియా డాన్స్..

బాయ్స్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ... ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని , విష్ణు, రామ్ చరణ్ వంటి స్టార్స్ అందరి సరసన నటించింది. కానీ సిద్ధార్థ్ హీరోగా భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చలాకీతనం, అమాయకత్వంతో కూడిన పాత్రలో ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకుంది. ఆరెంజ్ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గినా.. క్రేజ్ మాత్రం మారలేదు.

Genelia Deshmukh: ఏంటమ్మా ఆ ఎనర్జీ.. హాసినిని అంటే ఇలాగే ఉంటుంది మరీ.. భర్తతో కలిసి జెనీలియా డాన్స్..
Genelia, Ritesh
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2024 | 8:35 AM

Share

హా.హా.. హాసిని అంటూ తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్‏గా నిలిచిపోయింది హీరోయిన్ జెనీలియా. బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. బాయ్స్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ… ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని , విష్ణు, రామ్ చరణ్ వంటి స్టార్స్ అందరి సరసన నటించింది. కానీ సిద్ధార్థ్ హీరోగా భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చలాకీతనం, అమాయకత్వంతో కూడిన పాత్రలో ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకుంది. ఆరెంజ్ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గినా.. క్రేజ్ మాత్రం మారలేదు. హిందీలో వరుస మూవీస్ చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‏ముఖ్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది జెనీలియా. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

గతేడాది తన భర్తతో కలిసి వేద్ సినిమాలో నటించింది. ఈమూవీతోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగులో సమంత, నాగచైతన్య కలిసి నటించిన మజిలీ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. నార్త్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుని అత్యధిక వసూళ్లు రాబట్టింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది జెనీలియా. తన భర్త, పిల్లలతో కలిసి సరదాగా ఉన్న ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఇక తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ తో కలిసి డాన్స్.. అల్లరి వీడియోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. గతంలో సల్మాన్ ఖాన్ తో కలిసి డాన్స్ అదరగొట్టేసింది జెనీలియా. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది. ఇప్పుడు జెనీలియా మరో ఎనర్జిటిక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

క్రికెట్ గ్రౌండ్‏లో తన భర్తతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసింది. ఈ వీడియోను జెనీలియా ఫ్యాన్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే వీడియో చూస్తే.. ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మ్యాచ్ ఆడుతున్న తన భర్తను ఎంకరేజ్ చేసేందుకు జెనీలియా డాన్స్ చేసింది. ఆమెతోపాటు రితేశ్ కూడా తన భార్యతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ జెనీలియా ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ మా హసిని ఏం మారలేదని సంబరపడిపోతున్నారు. జెనీలియా, రితేశ్ డాన్స్ చూసి ముచ్చటపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ వీరిద్దరూ ఎప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!