Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: బాహుబలి టు పుష్ఫ.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల సక్సెస్‌ కు కారణం ఈ హీరోయిన్ భర్తనే

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం(నవంబర్ 17) సాయంత్రం విడుదలైంది. బీహార్‌లోని పాట్నాలో జరిగిన 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఓ స్టార్ హీరోయిన్ భర్త కూడా ఉన్నాడు.

Pushpa 2: బాహుబలి టు పుష్ఫ.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల సక్సెస్‌ కు కారణం ఈ హీరోయిన్ భర్తనే
Pushpa 2
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2024 | 11:09 PM

‘పుష్ప రెండో భాగానికి సంబంధించి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవీనా టాండన్ భర్త అనిల్ తడానీ కూడా పాల్గొన్నారు. ‘పుష్ప 2: ది రూల్’కి అనిల్ తడానీకి సంబంధం ఏమిటని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. సౌత్ సినిమాలను ఇండియా అంతటా బ్లాక్ బస్టర్స్ చేసిన ఘనత ఎవరికైనా దక్కితే అది అనిల్ తడానికే చెందుతుంది. రవీనా టాండన్ భర్త ‘పుష్ప: ది రైజ్’, ‘బాహుబలి – ది బిగినింగ్’, ‘బాహుబలి – ది కన్‌క్లూజన్’, ‘కెజిఎఫ్’, ‘కెజిఎఫ్ 2’ నుండి ‘కల్కి 2898 ఎడి’ వంటి అనేక సౌత్ చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అనిల్ తడాని బాలీవుడ్ లో ది మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. అతని సంస్థ AA ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ఉత్తర భారత రాష్ట్రాల మార్కెట్లలో చిత్రాలను పంపిణీ చేస్తుంది. 1994లో విడుదలైన ‘యే దిల్గీ’ సినిమాతో తడాని తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక 2015 నుండి, దక్షిణాది చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌లను పంపిణీ చేస్తున్నాడు.

అనిల్ తడాని మొదటి సౌత్ చిత్రం SS రాజమౌళి ‘బాహుబలి-ది బిగినింగ్’. ఈ చిత్రం భారతదేశం అంతటా భారీ వసూళ్లు రాబట్టింది. అప్పటి నుండి తడాని దక్షిణాదిలో విజయవంతమైన చిత్రాలను తీసుకుంటూనే ఉన్నాడు. అయితే అతను డిస్ట్రిబ్యూట్ చేసిన’ఆదిపురుష్’ మాత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేదు.

ఇవి కూడా చదవండి

రవీనా టాండన్, అనిల్ టడానీ 2003లో నిశ్చితార్థం చేసుకున్నారు. దీని తర్వాత, ఈ జంట 2004లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు పెళ్లయి 20 ఏళ్లు అయ్యింది. వీరికి రాషా తడాని, రణబీర్ వర్ధన్ అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. కూతురు రాషా త్వరలో ‘ఆజాద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.