ప్లాష్ న్యూస్ : ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ లీక్..’యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరా’

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.  బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తుండగా.. టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ‌్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశాడు. దీంతో సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి.  అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఇక ఈ […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:06 pm, Thu, 12 December 19
ప్లాష్ న్యూస్ : 'ఆర్ఆర్ఆర్' సాంగ్ లీక్..'యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరా'

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.  బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తుండగా.. టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ‌్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశాడు. దీంతో సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి.  అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా కరేజ్ చూపించబోతుండగా,  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు.

ఇండిపెండెన్స్ నేపథ్యంలో  తెరకెక్కుతున్న ఈ మూవీలో  రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఆడిపాడనున్నారు. ఇక జక్కన్న ఆస్థాన టీం.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రాజమౌళి అండ్ టీం.. లీకుల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో తెలిసిందే. యూనిట్‌లో మెబైల్ ఫోన్స్ అస్సలు అనుమతించరు. కనీసం లుక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  విషయంలో మాత్రం ఆయన లెక్కలు తప్పుతున్నాయి. లుక్ కాదు ఏకంగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్‌లో ఉన్న మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. దీంతో యూనిట్ అంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఇష్యూ విషయంలో రాజమౌళి టీంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది జరిగి ఒక్క రోజు కూడా కాకముందే..సినిమాలోని కీలక సాంగ్ రిలీజ్ అవ్వడం సంచలనంగా మారింది. లీక్‌ల పర్వం కొనసాగుతుండటంతో యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే వారు కొన్ని లింకులను తొలగించి కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ప్రజంట్ సినిమా  75 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  విశాఖ ఏజెన్సీలోని మోదాపల్లి, డల్లాపల్లి ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  2020 జులై 30న మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించారు.