గురూజీపై ఎందుకింత ట్రోలింగ్..!

సినిమా రిలీజైతే చాలు ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఆ సినిమాలో ఏది ఇతర సినిమాలకి సిమిలర్‌గా కనిపించినా కాపీ అంటూ ఇంటర్నెట్‌లో కడిగి పారేస్తున్నారు. తాజాగా ‘అల వైకుంఠపురములో ‘ టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. బన్నీని ఊర మాస్ స్టైల్లో చూసి ఫ్యాన్స్ అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్స్, వ్యూస్…రికార్డులే టార్గెట్‌గా దుమ్ములేపుతున్నారు. అయితే పొగిడే వాళ్లంతా కాకపోయినా విమర్శించే వాళ్లు కూడా ఎంతోకొంత మంది ఉంటారు. పలానా షాట్ దాని నుంచి కాపీ కొట్టారు, […]

గురూజీపై ఎందుకింత ట్రోలింగ్..!
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2019 | 4:36 PM

సినిమా రిలీజైతే చాలు ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఆ సినిమాలో ఏది ఇతర సినిమాలకి సిమిలర్‌గా కనిపించినా కాపీ అంటూ ఇంటర్నెట్‌లో కడిగి పారేస్తున్నారు. తాజాగా ‘అల వైకుంఠపురములో ‘ టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. బన్నీని ఊర మాస్ స్టైల్లో చూసి ఫ్యాన్స్ అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్స్, వ్యూస్…రికార్డులే టార్గెట్‌గా దుమ్ములేపుతున్నారు. అయితే పొగిడే వాళ్లంతా కాకపోయినా విమర్శించే వాళ్లు కూడా ఎంతోకొంత మంది ఉంటారు. పలానా షాట్ దాని నుంచి కాపీ కొట్టారు, ఆ మ్యూజిక్ దానికి దగ్గరగా ఉందంటూ ఎవరో జీతమచ్చి పనికి పెట్టుకున్నట్టే మాట్లాడతారు.

ఇప్పుడు ‘అల వైకుంఠపురములో ‘ టీజర్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే అందులోని పలు షాట్స్‌ని వేరే మూవీస్ నుంచి తీసుకున్నారని వారు ఆరోపించడం లేదు. త్రివిక్రమ్ తీసిన గత సినిమాల్లో ఉన్న షాట్సే మళ్లీ రిపీట్ చేశారంటూ వెరైటీగా ట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు నచ్చిన షాట్స్ రిపీట్ మోడ్‌లో డైరెక్టర్స్‌ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ మాత్రం దానికే ఇంత ఓవర్ చెయ్యాలా అనేది సినీ జనాల మాట. వాస్తవానికి టీజర్‌లో త్రివిక్రమ్ మార్క్ పెద్దగా కనిపించలేదు. అలాగని ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా కూడా అరవింద సమేతతో ఇండస్ట్రీ అదిరిపోయే హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్.

‘అ.. ఆ’ నుండి త్రివిక్రమ్ ట్రోలర్స్ బారిన పడ్డాడు. ఆ సినిమా కథను ఓ నవల నుంచి తీసుకున్నారు. మొదట మూవీ క్రెడిట్స్‌లో ఆ విషయాన్ని స్పష్టం చెయ్యలేదు. ట్రోలింగ్ రావడంతో, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రచయిత నేమ్ వెయ్యలేకపోయామని, తర్వాత యాడ్ చేశామని చెప్పి గురూజీ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. మరీ ఈ సారి బ్లాక్ బాస్టర్ ఇచ్చి, ట్రోలర్స్ నోర్లు మూయిస్తాడా..? లేక మునిలా తన పని తాను చేసుకుపోతాడా అనేది చూడాలి. ఇకపోతే వచ్చే ఏడాది జనవరి 12న  ‘అల వైకుంఠపురములో ‘ ప్రేక్షకుల ముందుకు రానుంది.