తెలుగు హీరో ఆత్మహత్యాయత్నం..రీజన్ ఇదే..!

సినిమా అనేది రంగుల ప్రపంచం. బయటకు తెరపై పడే బొమ్మ కనిపిస్తున్నా, తెరవెనుక అది చేయిస్తోన్న చిత్రాలు చాలానే ఉంటాయి. ఒక సినిమా వెండితెర మీదకు రావాలంటే ఎన్నో సవాళ్లు. ప్రసాద్ ల్యాబ్స్‌లోనే తమ ప్రస్థానాన్ని ముగించిన సినిమాలు కోకొల్లలు. తాజాగా ఎన్నో కలలతో  వెండితెరమీద తనను తాను హీరోగా చూసుకోవాలనుకున్న యువనటుడు దుర్గా ప్రసాద్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఫిలిం చాంబర్ ఎదుట  అతను పురుగుల మందు తాగాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు దుర్గా ప్రసాద్‌ను […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:53 am, Thu, 12 December 19
తెలుగు హీరో ఆత్మహత్యాయత్నం..రీజన్ ఇదే..!

సినిమా అనేది రంగుల ప్రపంచం. బయటకు తెరపై పడే బొమ్మ కనిపిస్తున్నా, తెరవెనుక అది చేయిస్తోన్న చిత్రాలు చాలానే ఉంటాయి. ఒక సినిమా వెండితెర మీదకు రావాలంటే ఎన్నో సవాళ్లు. ప్రసాద్ ల్యాబ్స్‌లోనే తమ ప్రస్థానాన్ని ముగించిన సినిమాలు కోకొల్లలు. తాజాగా ఎన్నో కలలతో  వెండితెరమీద తనను తాను హీరోగా చూసుకోవాలనుకున్న యువనటుడు దుర్గా ప్రసాద్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఫిలిం చాంబర్ ఎదుట  అతను పురుగుల మందు తాగాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు దుర్గా ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించారు.

40 లక్షలు పెట్టి  ‘నానిగాడు’ అనే సినిమా తీస్తే..గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని యూట్యూబ్‌లో పెట్టినట్లు సమాచారం. దీంతో సదరు మూవీ టీం ఫిల్మ్ చాంబర్ ముందు మంగళవారం రోజు ఆందోళనకు దిగింది. సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిందని.. త్వరలో రీలీజ్‌కు ఏర్పాట్లు  చేసుకుంటుంటే..ఇంత డబ్బులు పెట్టిన తమ కడుపు కొట్టారని వారు ఆరోపించారు. వెంటనే మూవీ లింక్స్‌ని యూట్యూబ్ నుంచి డిలీట్ చెయ్యాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని హీరో దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. కాగా బుధవారం అతను నిజంగానే ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది.