AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Venkat: రామ్ చరణ్ సాయం.. కానీ.. నటుడు ఫిష్ వెంకట్ మృతిపై కూతురు కన్నీళ్లు

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నటుని ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా అందరూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఫిష్ వెంకట్ మృతితో ఆయన కూతురు స్రవంతి కన్నీరుమున్నీరవుతోంది.

Fish Venkat: రామ్ చరణ్ సాయం.. కానీ.. నటుడు ఫిష్ వెంకట్ మృతిపై కూతురు కన్నీళ్లు
Fish Venkat
Basha Shek
|

Updated on: Jul 19, 2025 | 6:03 PM

Share

తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న నటుడు ఫిష్‌ వెంకట్‌ శుక్రవారం (జూలై 18న) రాత్రి కన్నుమూశారు. దీంతో ఫిష్ వెంకట్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా వెంకట్ ను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేసిన కూతురు కన్నీరుమున్నీరవుతోంది. తండ్రి మరణం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. ‘ మొన్నటివరకు నాన్నకు కిడ్నీ సమస్య ఉందని మాత్రమే వైద్యులు చెప్పారు. కానీ నిన్న (శుక్రవారం) అన్ని టెస్టులు చేస్తే కాలేయం కూడా పాడైపోయిందన్నారు. ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతోందన్నారు. ఇక బతకడం కష్టమన్నారు. నిన్న సాయంత్రం ఆరింటి వరకు కూడా నాన్న బాగానే ఉన్నారు. అయితే 80% కోమాలో ఉన్నారని వైద్యులు చెప్పారు. రాత్రి సడన్‌గా బీపీ డౌన్ అయిపోయింది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 9.25 గంటలకు నాన్న తుది శ్వాస విడిచాడు’

‘కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయిస్తే నాన్న బతికేవారేమో!. అలాగే నాన్నను ఆస్పత్రిలో చేర్పించినప్పుడే ఎవరైనా ఆర్థిక సాయం చేసుంటే ఆయన కచ్చితంగా బతికేవాడు. డబ్బు లేకపోవం వల్లే నాన్న చనిపోయారు. సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోలు విశ్వక్ సేన్ లు, కృష్ణ మాచినేని మాత్రమే సాయం చేశారు. అలాగే రామ్‌చరణ్‌కు చెందిన క్లీంకార ఫౌండేషన్‌ నుంచి రూ.25 వేల సాయం అందింది. అయితే రామ్‌చరణ్‌ నాన్నను మంచి ఆస్పత్రిలో చేర్పించాడు, ఆర్థిక సాయం చేశాడంటూ వార్తలు ప్రచారం చేశారు. దీని వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మాకు సాయం అందలేదు. డబ్బు చేతికి అంది ఉంటే నాన్న ఈరోజు బతికి ఉండే వాడేమో.. నాన్నఆస్పత్రిలో ఉంటే ఒక్క గబ్బర్‌ సింగ్‌ టీమ్‌ తప్ప ఎవరూ ఆయనను చూడడానికి రాలేదు’ అని వాపోయింది స్రవంతి.

ఇవి కూడా చదవండి

కాగా ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో నటించి నవ్వించారు. ఎక్కువగా వీవీ వినాయక్ చిత్రాల్లో ఆయన కనిపించారు.  ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, ఢీ, దుబాయ్ శ్రీను, కృష్ణ, బుజ్జిగాడు, రెడీ, ఆంజనేయులు, అదుర్స్, మిరపకాయ్, కందిరీగ, రచ్చ, గబ్బర్ సింగ్, బలుపు, అత్తారింటికి దారేది తదితర సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు వెంకట్.

బన్నీ సినిమాలో ఫిష్ వెంకట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..