రూ. 7 కోట్లతో తీస్తే.. 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్
2025 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టినవి అతి కొద్ది సినిమాలే కాగా.. బోల్తా కొట్టిన సినిమాలు ఎన్నో. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా.. ఛావా నిలిచింది. అయితే.. ఛావా రికార్డును కూడా బద్దలు కొట్టిన చిత్రం మరొకటి ఉంది. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా.. 1200 శాతం వసూళ్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది.
ఈ సినిమా మరేదో కాదు.. తమిళంలో సూపర్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ. టూరిస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే. అభిషాన్ జీవిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసి.. లాభాల పరంగా నంబర్ 1గా నిలిచింది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మిథున్ జై శంకర్, కమలేష్ జగన్, ఎం. శశికుమార్ వంటి అనేక మంది తారలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 29 ఏప్రిల్ 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి వారంలో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత పాజిటివ్ మౌత్ టాక్ ఉండడంతో అద్భుతమైన వ్యాపారం చేసింది. భారతదేశంలో 62 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ ఏడాది అతి తక్కువ సమయంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఛావా సినిమా.. ఏకంగా రూ. 808 కోట్ల వ్యాపారం చేసింది. అయితే, దీని బడ్జెట్ 90 కోట్ల రూపాయలు. అంటే.. దీని లాభం 800 శాతం కాగా, టూరిస్ట్ ఫ్యామిలీ లాభం 1200 శాతం. దీని ప్రకారం ఇది అత్యంత లాభాలు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

