చిన్నతనంలోనే మోడ్రన్ స్టెప్పులేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు వెండి తెరపై హీటు పుట్టిస్తుంది .. ఎవరో గుర్తుపట్టారా

చిన్నతనంలోనే మోడ్రన్ స్టెప్పులేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు వెండి తెరపై హీటు పుట్టిస్తుంది .. ఎవరో గుర్తుపట్టారా

ఇటీవల కాలంలో హీరోయిన్స్ కు క్రేజ్ విపరీతంగా పెనుగుతుంది. సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు రెచ్చిపోతున్నారు.

Rajeev Rayala

|

Apr 09, 2022 | 12:36 PM

ఇటీవల కాలంలో హీరోయిన్స్ కు క్రేజ్ విపరీతంగా పెనుగుతుంది. సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు రెచ్చిపోతున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్.. చిత్ర విచిత్రమైన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను చూపుతిప్పుకోకుండా చేస్తున్నారు. లేటెస్ట్ ఫొటోస్ తోపాటు చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేసి అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి హాట్ నెస్ కు పెట్టింది పేరు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముట్టుకుంటే కందిపోయే సోయగంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇంతకు ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటా.. ఈ అమ్మడి పోలికలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇంతకు ఈ ఫొటోలో ఉన్నది ఎవరంటే..

ఆర్జీవీ పరిచయం చేసిన హీరోయిన్స్ లో ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అయిన బ్యూటీ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అప్సర రాణి. ఈ అమ్మడి అసలు పేరు అంకిత మహారాణ. ఆర్జీవీ తో కలిసి రెండు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ సుందరికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు నటించిన లెస్బియన్ మూవీ డేంజరస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అప్సరరాణి తన అందాలతో కనువిందు చేయనుందని.. ఇప్పటికే విడుదలైన టీజర్స్ , ట్రైలర్స్ , పోస్టర్స్ చెప్తున్నాయి.

Apsara Rani

Apsara Rani

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu