RRR Movie: అట్లుంటది మరీ ఆర్ఆర్ఆర్ క్రేజ్ అంటే.. లాస్ ఏంజెల్ థియేటర్లో అభిమానుల రచ్చ..
లాస్ ఏంజెల్స్‌లోని చైనీస్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి సైతం లాస్ ఏంజెల్లో ఉన్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో నాటు నాటు పాటకు స్క్రీన్ వద్దకు వచ్చి కొందరు స్టెప్పులతో అదరగొట్టారు.

బాహుబలి తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాపై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈమూవీకి ఫిదా అయ్యారు సినీ ప్రియులు. కేవలం ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రమే కాకుండా.. ఇందులో సాంగ్స్ సైతం నెట్టింట దూసుకుపోయాయి. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటలో చరణ్, తారక్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పులు చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు విదేశాల్లో సత్తా చాటుతోంది. తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద జాన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఒకటైన బియాండ్ ఫెస్ట్‌లో భాగాంగా ఆర్ఆర్ఆర్.. ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని చైనీస్ థియేటర్లో ప్రదర్శించారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి సైతం లాస్ ఏంజెల్లో ఉన్నారు.
ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమా చూసేందుకు మాత్రమే కాకుండా రాజమౌళితో ముచ్చటించేందుకు అనేకమంది వచ్చారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో నాటు నాటు పాటకు స్క్రీన్ వద్దకు వచ్చి కొందరు స్టెప్పులతో అదరగొట్టారు. నాటు నాటు అంటూ సిగ్నెచర్ స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.




అయితే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు మాత్రమే కాకుండా హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవుతుందని భావించారు సినీ విశ్లేషకులు. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ కాకుండా.. గుజరాతీ ప్రాంతీయ చిత్రం చెలో షో ఎంపికైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కనుంది.
#RRRMovie fans ran to the front of the theater for “Naatu Naatu” while director S. S. Rajamouli watched the film. #RRRforOscars #OscaRRRs https://t.co/rG2BiaGyHT pic.twitter.com/l4TpXsg0qu
— Los Angeles Times (@latimes) October 1, 2022
SS Rajamouli gets a rapturous, long standing ovation after #RRR at #BeyondFest pic.twitter.com/KGBKlCZeVR
— eric (@MrEAnders) October 1, 2022
This is just half of the line for @RRRMovie at @ChineseTheatres IMAX by @BeyondFest #RRRMovie #Rajamouli #RamCharan #JrNTR pic.twitter.com/2JFFqIEPB2
— Anup Dasari (@anupdasari) October 1, 2022
??? #RRRMovie pic.twitter.com/NAaaRCvBQs
— RRR Movie (@RRRMovie) October 1, 2022
Seated for #RRR at @ChineseTheatres brought to you by @BeyondFest! Such a cool night to be here screening this movie! Excited to finally catch it on the big screen after watching it with my siblings a couple months ago when I was back in NY. pic.twitter.com/fbpY6Lc8LZ
— Will Landman (@WillTheLandMan) October 1, 2022
.@RRRMovie director @ssrajamouli has arrived for tonight’s sold out #IMAX showing at #BeyondFest pic.twitter.com/LEnXeDgGi2
— TCL Chinese Theatres (@ChineseTheatres) October 1, 2022
In line now, with treats! pic.twitter.com/54Y2XnxEQW
— Ariel Vida (@ArielVida) September 30, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.